బట్టతలతో బ్రాండ్‌బిల్డింగ్

బట్టతలతో కూడా బ్రాండ్‌ అయ్యే కాలమిదిది. బట్టతలకే కాదు, ఏ లోపానికైనా ఒక ప్రత్యేకతగా మారే అవకాశం ఉంది.;

Update: 2025-07-13 04:30 GMT

ఇప్పటి కాలంలో ప్రతిఒక్కరు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలని, యూనిక్ గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. అయితే అందుకోసం జుట్టు పెంచించుకోవాలా? విగ్గు పెట్టుకోవాలా? లేక ఖరీదైన మేకోవర్‌ల కోసం వెచ్చించాలా? ఇవన్నీ పక్కన పెట్టేసి తన బట్టతలనే బ్రాండ్‌గా మార్చుకున్న వ్యక్తి షఫిక్ హసీం.

-బట్టతల లోపం కాదు.. లోకానికి సందేశం!

షఫిక్ హసీం ఒక బుద్ధిమంతుడు, ఉన్నత విద్యావంతుడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న అతనికి కొన్నేళ్ల క్రితం జుట్టు ఊడిపోవడం మొదలైంది. చివరకు పూర్తిగా బట్టతల వచ్చింది. చాలా మంది దశలో తమ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. గుండుతనం ఓ అపరాధంగా భావించి జుట్టు రీప్లేస్‌మెంట్‌, విగ్గులు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ల వైపు పరుగులు పెడతారు. కానీ షఫిక్‌ దారి వేరు.

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా తీసుకుని, తన బట్టతలనే ఒక ప్రకటన పటంగా మార్చుకున్నాడు. అతని తలమీద వాణిజ్య ప్రకటనలు వేయడం ప్రారంభించాడు. ప్రత్యేకమైన పెయింటింగ్ టెక్నిక్‌తో తలమీద యాడ్స్ వేయించి, రోడ్లమీద తిరిగే వెయ్యడమే కాదు, సోషల్ మీడియాలోనూ ఆ ఫోటోలు షేర్ చేస్తున్నాడు. ఒక్క యాడ్‌కి రూ. 50,000 వసూలు చేస్తూ తనకు తనే ఆదాయ మార్గాన్ని సృష్టించుకున్నాడు.

‘బంగారం’ బట్టతలగా మారిన హసీం

ఇలాంటి ప్రేరణాత్మక ప్రయాణంలో మనకు గుర్తొచ్చే మరో వ్యక్తి కిరణ్ కుమార్. తన గుండు తలతోనే "తయారీ ఖర్చు లేదు.. మంజూరీ లేదు.. మీ డబ్బుకి మా బంగారం హామీ!" అంటూ ప్రచార పీఠికగా మారిన లలిత జ్యువెలర్స్ అధినేత. షఫిక్ హసీం కూడా కిరణ్ కుమార్ మాదిరిగానే బట్టతలను నచ్చిన కోణంలో మార్చుకున్నాడు. అడ్డంకి కాదని, అది అవకాశమని నిరూపించాడు.

- నెజిటిజన్ల ప్రశంసలు.. మీమ్స్ మద్దతు

హసీం చేస్తున్న యూనిక్ పని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “జుట్టు లేకున్నా.. తెలివి ఉన్నాడంటే ఇలాగే ఉండాలి” అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. “తల మీద జుట్టు ఉండకపోయినా.. తల మీద ఆదాయం ఉంది” అంటూ నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు, సెల్యూట్ చేస్తున్నారు.

ప్రేరణగా మారిన హసీం

జుట్టు ఊడిపోయిందని బాధపడేవారికి హసీం ఒక రోల్ మోడల్. జీవితంలో ప్రతీ లోపాన్ని ఒక లాభంగా ఎలా మార్చుకోవాలో నేర్పిన ఒక ‘లైవ్ ఎగ్జాంపుల్’. “ఉపాయం ఉంటే అపాయం కూడా చాన్స్ అవుతుంది” అనే పాఠాన్ని హసీం కథ తిరిగి రుజువు చేస్తోంది.

బట్టతలతో కూడా బ్రాండ్‌ అయ్యే కాలమిదిది. బట్టతలకే కాదు, ఏ లోపానికైనా ఒక ప్రత్యేకతగా మారే అవకాశం ఉంది. కేవలం ఆత్మవిశ్వాసం, క్రియేటివిటీ, పట్టుదల ఉంటే చాలు. షఫిక్ హసీంలాంటి వ్యక్తులు నీలాంటి ఆణిముత్యాలే దేశానికి కావాలి సామీ!

Tags:    

Similar News