మంత్రుల ముచ్చట: సత్యకుమార్ గ్రాఫ్ ఎలా ఉంది.. ?
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ తరఫున మంత్రిగా ఉన్నారు సత్యకుమార్ యాదవ్. వైద్య విద్య, ఆరోగ్య శాఖలను ఆయన తీసుకున్నారు.;
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ తరఫున మంత్రిగా ఉన్నారు సత్యకుమార్ యాదవ్. వైద్య విద్య, ఆరోగ్య శాఖలను ఆయన తీసుకున్నారు. నిజానికి 204-19 మధ్య కూడా చంద్రబాబు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఈ శాఖనే అప్పగించారు. అప్పట్లో కామినేని శ్రీనివాసరావు.. ఈ శాఖ కు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనను తీసుకుందామని ప్రతిపాదన వచ్చినా.. ఆర్ ఎస్ ఎస్ నాయకులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రభావం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారి ఆశీస్సులతో సత్యకుమార్ మంత్రి అయ్యారు.
ఇక, తొలి ఆరు మాసాలు ఒక లెక్క.. మలి ఆరు మాసాలు ఒక్క లెక్కగా సత్యకుమార్ పనితీరును చూడాలి. ఎలాగంటే.. ఆయన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత..తొలి ఆరు మాసాలు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా పర్యటించారు. ఆసుపత్రల్లోని లోపాలను ఎత్తి చూపించారు. వైసీపీ అలా చేసింది.. ఇలా చేసింది.. అని విమర్శలు గుప్పించారు. ఇది మంచిదే.. ఏ ప్రభుత్వమైనా.. గత ప్రభుత్వ తప్పులు చూపించి తర్వాత.. తాముమంచి చేశామని చెప్పుకొనే ప్రయత్నం చేసుకుంటుంది. ఈ క్రమంలో తొలి ఆరు మాసాలు కూడా సత్యకుమార్ యాదవ్ ఇదే చేశారు.
ఈ క్రమంలోనే ఆయన గ్రామీణ ప్రజలకు అప్పటివైసీపీ ఏర్పాటు ఇంటింటి వైద్యాన్ని ఎత్తేశారు. అదేసమయంల ఆరోగ్య శ్రీకింద.. 108 వాహనాల కాంట్రాక్టును మార్చేయడంతోపాటు.. వాహనాల సంఖ్యలోనూ కోత పెట్టారు. సరే.. విధానపరమైన నిర్ణయాలు కాబట్టి ఎవరూ కాదనలేదు. కానీ.. ఆ తర్వాత ఆరు మాసాల్లో మాత్రం వైద్యం కుంటుబడింది. దీనికి సత్యకుమార్ యాదవ్ బాధ్యత వహించాల్సి ఉంది. ఆరోగ్య శ్రీ కింది ఇప్పుడు పేదలకు వైద్యం అందడంలేదన్నది అనుకూల మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్‌ను మంత్రి ప్రమోట్ చేస్తున్నారు. కానీ, దీనికి వైద్య శాలల్లో వైద్యం కరువైంది.
మరోవైపు.. వైసీపీ హయాంలో కేంద్రం నుంచి తీసుకువచ్చిన 17 వైద్య శాలల్లో 9 ఆసుపత్రులను రద్దుచేయించారు. కానీ, మిగిలిన వాటినైనా నిర్మాణం పూర్తి చేయించారా? అంటే.. అది కూడా లేదు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని ఆయన చెప్పినా.. సాధ్యం కావడం లేదు. దీంతో ఆయా కళాశాలలు మూత వేసే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది బడ్జెట్ సమయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించలేక పోయింది. ఇప్పుడుఅదే పెద్ద సమస్యగా మారింది. విజయవాడలో వైద్య విద్యార్థుల ధర్నా.. పోలీసుల లాఠీ చార్జీ ప్రభుత్వానికి మచ్చగా మారింది. మొత్తంగా చూసుకుంటే.. తొలి ఆరు మాసాల్లో ఉన్న దూకుడు తర్వాత.. తగ్గిన దరిమిలా.. సత్యకుమార్ గ్రాఫ్ అప్పట్లో ఉన్నట్టుగా అయితే.. ఇప్పుడు లేదని అంటున్నారు.