ఏపీ మంత్రికి సెగ‌: ఆయ‌నెవ‌రో తెలియ‌దంటున్న ప్ర‌జ‌లు.. !

ఇదే ఇప్పటికే ఇక్కడ వినిపిస్తున్న మాట. తమ ఎమ్మెల్యే ఎవరు అని ప్రశ్నిస్తే వెంకటరామిరెడ్డి పేరును చాలామంది చెప్పుకొచ్చారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు సైలెంట్ గా ఉండడం మరో విశేషం.;

Update: 2025-09-16 02:53 GMT

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాల తెర‌మీదకు వ‌చ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన సత్య కుమార్ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గంలో దాదాపు సగానికి మందికి పైగా ప్రజలకు సత్య కుమార్ అంటే ఎవరో తెలియదు అనే మాట వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది. తాజాగా ఆన్‌లైన్‌ ఛానల్ నిర్వహించిన సర్వేలో ``మీ ఎమ్మెల్యే ఎవరు`` అంటూ స్థానికులను ప్రశ్నించినప్పుడు ఆయన పేరు చెప్పేందుకు చాలా మంది ఇబ్బంది పడ్డారు.

తమకు తెలియదని ఎక్కువ మంది చెప్పగా మరికొందరు ఆయన పేరును విభిన్నంగా చెప్పుకొచ్చారు. ఎప్పటికీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ నాయకుడిని కొంతమంది చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి గత ఎన్నికలకు ముందు `గుడ్ మార్నింగ్ ధర్మవరం` పేరుతో అప్పటి ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ వెంకట్రామిరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలను కలుసుకున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే.. ప్రయత్నం చేయటం విశేషం. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఆయన నేరుగా కనెక్ట్ అయ్యారు.

ఇదే ఇప్పటికే ఇక్కడ వినిపిస్తున్న మాట. తమ ఎమ్మెల్యే ఎవరు అని ప్రశ్నిస్తే వెంకటరామిరెడ్డి పేరును చాలామంది చెప్పుకొచ్చారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు సైలెంట్ గా ఉండడం మరో విశేషం. అసలు ప్రస్తుతం ఉన్న సత్య కుమార్ మంత్రివర్గంలో ఉన్నారన్న విషయం కూడా మెజారిటీ ప్రజలకు తెలియక పోవడం మరింత ఆసక్తికర అంశం. మరి నియోజకవర్గంలో ఆయన ఉండకపోవడమా లేకపోతే కార్యకర్తల అయినా సరే ప్రజల మధ్యకు వెళ్లకపోవడం అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ధర్మవరం స్థానం నుంచి సత్య కుమార్ యాదవ్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. నిజానికి అప్పటివరకు కూడా ఈ నియోజకవర్గ టికెట్‌ను టిడిపి యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఆశించారు. అయితే, చివరి నిమిషంలో కూటమిలో భాగంగా ఈ టికెట్ను చంద్రబాబు నాయుడు బిజెపికి కేటాయించారు. ఆ వెంటనే ఢిల్లీలో ఉన్న సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గానికి రావడం వంటివి జరిగాయి. కూటమి ప్రభావంతో ఆయన విజయం దక్కించుకున్నప్పటికీ ప్రజల్లో మాత్రం పెద్దగా ఆయన పేరు వినిపించడం లేదు.

ఆయన గురించి పట్టించుకోవ‌డం కూడా లేదు. మరి పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి సత్యకుమార్ మరో నియోజకవర్గాన్ని వెతుక్కోవలసిన అవసరం ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఏ నాయకుడైనా ప్రజల మధ్య వెళ్లాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. వారికి అందుబాటులో కూడా ఉండాలి. కానీ, సత్య కుమార్ యాదవ్ పేరే తెలియదని గ్రామీణ స్థాయిలోనూ మండల స్థాయిలో ప్రజలు చెప్పటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిని బట్టి సత్య కుమార్ భవిష్యత్తు కార్యాచరణ అత్యంత కీలకంగా మార‌నున్న‌ద‌ని పరిశీలకులు చెబుతున్నారు.

Tags:    

Similar News