వైట్‌ హౌస్‌ లో "సారే జహాసె అచ్ఛా" రాగం... "పానీ పూరీ" వంటకం!

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే వైట్ హౌస్ లో ఇదంతా ఎందుకు జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!

Update: 2024-05-14 10:30 GMT

అమెరికా అధ్యక్ష భవనంలో "సారే జహాసె అచ్ఛా..." గీతం వినిపించడం.. దానికి సంబంధించి శ్రవణానందకరంగా ఉన్న మ్యూజిక్ అలరించడంతో పాటు.. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ కూడా దర్శనమివ్వడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే వైట్ హౌస్ లో ఇదంతా ఎందుకు జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!

ఆసియా అమెరికన్లు (ఏఏ), స్థానిక హవాయియన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌ (ఎన్.హెచ్.పి.ఐ) లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో అగ్రారాజ్యానికి ఆసియా అమెరికన్లు అండ్‌ స్థానిక హవాయియన్‌, పసిఫిక్‌ ఐలాండర్‌ కమ్యూనిటీలు చేస్తున్న సహకారానికి గుర్తుగా వైట్‌ హౌస్‌ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

దీంతో... భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాలు, వంటకాలు ప్రత్యక ఆకర్షణగా నిలిచినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా భారత్‌ కు చెందిన "సారే జహాసె అచ్ఛా" గీతాన్ని ఆలపించడం విశేషం. ఇదే సమయంలో అతిథులకు పానీపూరీ, సమోసాను వడ్డించడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సందర్భంగా అమెరికాలోని శ్వేత సౌథంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ఇండియన్‌ - అమెరికన్‌ కమ్యూనిటీ లీడర్‌ అజయ్‌ జైన్‌ భూటోరియా "ఎక్స్‌" వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Read more!

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. ఇందులో భాగంగా... వందల ఏళ్ల క్రితం ఆసియా నుంచి వలస వచ్చినవారికి స్థానిక హవాయియన్లు తమ భూములను ఇచ్చారని.. ఫలితంగా వలసవచ్చిన వారంతా ఇక్కడే స్థిరపడ్డారని.. అలా ఇరువర్గాల వారసత్వం దేశ చరిత్రలో భాగమైందని పేర్కొన్నారు.

Tags:    

Similar News