• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చిరు చిన్న కుమార్తెతో...

చిరు చిన్న కుమార్తెతో సానియా అడుగులు.. వీరు చేస్తున్నదేమంటే?

| కెరీర్ కొనసాగుతుండగానే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని ఓ అబ్బాయికి తల్లయింది.

By - Tupaki Desk
Update: 2025-01-06 11:30 GMT

భారత్ లో అసలు టెన్నిస్ కు అందులోనూ మహిళల టెన్నిస్ లో చోటుందా? అనే ప్రశ్న నుంచి.. మనదగ్గర నుంచి సైతం చాంపియన్లు పుట్టగలరని నిరూపించింది హైదరాబాదీ సానియా మీర్జా. 20 ఏళ్ల పాటు దేశ టెన్నిస్ కు ఐకాన్ గా నిలిచింది. కెరీర్ కొనసాగుతుండగానే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని ఓ అబ్బాయికి తల్లయింది. అయినప్పటికీ భారత్ తన సొంత దేశమని గర్వంగా చెప్పేది సానియా. మరి దాదాపు రెండేళ్ల కిందటనే టెన్నిస్ నుంచి రిటైరైన ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు..? భర్తతో నిరుడు విడిపోయిన ఆమె సొంత నగరం హైదరాబాద్ లోనే ఉన్నారా? దుబాయ్ లో కొనుక్కున్న ఫ్టాట్ లో ఉంటున్నారా? అనేది అభిమానులకు అంతుపట్టలేదు.

రాకెట్ వదిలి.. చిన్నారుల చేయి పట్టి

చిన్నారుల శారీరక దారుఢ్యం, చదువు కోసం వినూత్న రీతితో నిరుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో ఏర్పాటైంది సీసా స్పేసెస్‌. రాకెట్ వదిలి పెట్టిన సానియా ఇప్పుడు ఈ సంస్థతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, సీ సా స్పేసెస్ పార్ట్ నర్ లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల. ఆదివారం ఈ సంస్థ కార్యాలయంలో సానియా మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలంతా ఫోన్లు, ట్యాబ్ లు, టీవీలకు అతుక్కుపోతున్నారని, ఐప్యాడ్ ఉంటేనే అన్నం తింటున్నారని వాపోయింది. తల్లిగా ఈ సమస్య తనకు తెలుసని చెప్పింది. పిల్లలకు చదువు ఒక్కటే కాదని, మంచి ఆహారం, వాతావరణం, ఫిట్‌ నెస్ ఎంతో అవసరం అని.. ఆ అంశాల్లో సీసాతో కలిసి పనిచేస్తానని తెలిపింది.

సానియా ఆటలోనే కాదు జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. క్రీడలో ఎన్నోసార్లు గాయాలపాలైంది. షోయబ్ తో విడాకుల అనంతరం భారత్ లోనే ఉంటోంది. వ్యక్తిగతంగా చూస్తే సానియా 15 ఏళ్లకే టెన్నిస్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు తన ఏకైక కుమారుడు భవిష్యత్తుపైనే శ్రద్ధ పెట్టింది. ఇక షోయబ్ నుంచి విడిపోయాక ఆమె జీవితంలో ఏం నిర్ణయం తీసుకుంటారా? అని అందరూ ఎదురుచూశారు. టీమ్ ఇండియా క్రికెట్ స్టార్ తో ముడిపెట్టి అతడిని పెళ్లి చేసుకోనుందంటూ కథనాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సానియా తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసింది.

Tags:    
  • Womentennis 
  • Indiatennisplayer 
  • Saniamirza 
  • Pakistanicricketer 
  • Shoaibmalik 
  • BottleSpaces 
  • Jubileehills 
  • Chiranjeevi 
  • Sreejakonidela 
  • Sania 
  • Education 
  • Shoaib 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS