• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాయ్‌ ఫ్రెండ్‌ ఆలివర్‌ ని...

బాయ్‌ ఫ్రెండ్‌ ఆలివర్‌ ని పెళ్లాడిన ఓపెన్‌ ఏఐ సీఈఓ ఆల్ట్‌ మన్‌!

| ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ ఏఐ సీఈఓ శాం ఆల్ట్‌ మన్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ ను పెళ్లాడారు

By - Tupaki Desk
Update: 2024-01-12 13:15 GMT

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ ఏఐ సీఈఓ శాం ఆల్ట్‌ మన్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ ను పెళ్లాడారు. ఈ సమయంలో ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ వైరల్ అవుతున్న సమయంలో ఓ ప్రముఖ మీడియా సంస్థతో స్పందించిన ఆల్ట్‌ మన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతికొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిందని తెలుస్తుంది.

అవును... ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం, అబ్బాయిలు కూడా మరో అబ్బాయిని పెళ్లాడటం గురించి అనేక సంఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓపెన్‌ ఏఐ సీఈఓ శాం ఆల్ట్‌ మన్‌.. తన బాయ్ ఫ్రెండ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆలివర్‌ మల్హెరిన్‌ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ ఇష్యూగా మారింది.

చాట్‌ జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈఓ గా ఉన్న శాం ఆల్ట్‌ మన్‌ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయనను సంస్థ తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీయడం.. ఆ సమయంలో అతడికి గూగుల్ నుంచి ఆఫర్ వచ్చిందనే కథనాలు వచ్చిన నేపథ్యంలో... ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది.

ఇక ఆస్ట్రేలియాకు చెందిన మల్హెరిన్‌ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారు. మెల్‌ బోర్న్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన అతడు... 2020 ఆగస్టు నుంచి 2022 నవంబర్‌ వరకు మెటాలో పనిచేశారు. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్‌ లో న్యూయార్క్‌ మ్యాగజైన్‌ తో మాట్లాడుతూ.. ఇద్దరమూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఒకే ఇంట్లో ఉంటున్నామని ఆల్ట్‌ మన్‌ తొలిసారి వెల్లడించారు. త్వరలో వీరిద్దరూ పిల్లలను కూడా పెంచుకోవాలని భావిస్తున్నారట.

కాగా... హై స్కూల్‌ లో ఉన్న సమయంలోనే తాను "గే" అని ఆల్ట్‌ మన్‌ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం... సుమారు తొమ్మిదేళ్ల పాటు లూప్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్‌ సివోతో డేటింగ్‌ చేసి 2012లో విడిపోయారు.

Tags:    
  • Openaiceo 
  • Samaltman 
  • Olivermulherin 
  • Artificialintelligence 
  • Samaltmanmarriage 
  • Gaymarriage 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS