అనంతపురంలో హాట్ టాపిక్... శింగనమలలో శైలజానాథ్ కు గుడ్ న్యూస్!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంటుంది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది

Update: 2024-05-08 05:46 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి క్లైమాక్స్ కి చేరుకుంటుంది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ మొదలైంది! ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా శింగనమల ఓటర్లు కాంగ్రెస్ కు గుడ్ న్యూస్ చేప్పే అవకశాలున్నాయని అంటున్నారు.

అవును... వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోరు వైసీపీ వర్సెస్ కూటమి అనే కామెంట్లు వినిపించిన నేపథ్యంలో... అనూహ్యంగా షర్మిళ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా శింగనమల నియోజకవర్గంలో దశాబ్ధ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో... ఈ విషయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 స్థానాల్లోనూ 12 స్థానాల్లో వైసీపీ గెలిచింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మిగిలిన 12 జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. ఇలా కాస్త విభిన్నమైన గణాంకాలు ఉన్న అనంతపురంలో.. శింగనమల నియోజకవర్గంలో గెలుపు అంచనాలపై ఆసక్తికర అంచనాలు వినిపిస్తున్నాయి.

Read more!

ఇందులో భాగంగా... అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి శైలజానాథ్ కీలకంగా మారారని అంటున్నారు. పైగా ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు కూడా పరోక్షంగా సాకే శైలజానాథ్ గెలుపును కాంక్షిస్తున్నారనే విషయం తెరపైకి రావడం ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకు కూడా బలమైన కారణం ఉందని అంటున్నారు.

2014 సమయంలో మంత్రిగా ఉంటూనే సమైక్యవాదం బలంగా వినిపించారు శైలజానాథ్! సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న నేతగా ఆయన జిల్లాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో దశాబ్ధ కాలంలో ఎలాంటి పదవులు లేకపోయినా.. నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారని.. అందరికీ కలుపుకుపోతున్నారని చెబుతున్నారు.. ఈ సమయంలోనే పార్టీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన ఓట్ బ్యాంక్‌ ను తిరిగి తన వైపు తిప్పుకొన్నారని తెలుస్తుంది.

పైగా... 2004లో ద్విముఖ పోరులోనూ, 2009 లో త్రిముఖ పోరులోనూ గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు, నియోజకవర్గంలో చేసిన పలు అభివృద్ధి పనులు ఆయన ఖాతాలోనే ఉండటంతో... ప్రజలు ఆ సీనియారిటీకే పట్టం కట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటీవల వచ్చిన కొన్ని సర్వే ఫలితాలూ సాకేకు సానుకూలంగా ఉన్నాయని సమాచారం!

ఇదే క్రమంలో... రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోయినా.. ఆయన ఇతర పార్టీల్లోకి వెళ్లలేదు. వైసీపీ, టీడీపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినా.. కాంగ్రెస్‌ లోనే కొనసాగారు! దీంతో... ఆయన క్రెడిబిలిటీ, కమిట్మెంట్ విషయంలో స్థానిక ప్రజానికానికి సాదాభిప్రాయం ఉందని చెబుతున్నారు. ఫలితంగా... అన్నీ అనుకూలంగా జరిగితే శింగనమలలో కాంగ్రెస్ బోణీ కొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News