సరిగ్గా నెల.. జపాన్ ను కుదిపేయనున్న భూకంపం.. ఆమె జోస్యంతో బేజార్

ఇక టాట్సుకి.. జూలై 5న జపాన్ ను భారీ విపత్తు కుదిపేస్తుందని చెబుతోంది. భూకంపాలు, సునామీ వస్తుందని హెచ్చరిస్తోంది.;

Update: 2025-06-05 12:49 GMT

ద్వీప దేశం జపాన్ అంటేనే భూకంపాలకు నిలయం.. సునామీ హెచ్చరికలూ అక్కడ సర్వసాధారణం.. మనం వినేవి కొన్ని పెద్ద భూ కంపాలే.. జపాన్ ప్రజలకు తరచూ అలాంటి అనుభవాలు సహజం. అందుకే అక్కడి ప్రజలు తమ ఇళ్లను సైతం భూకంపాలను తట్టుకునేలా నిర్మించుకుంటారు. తాజాగా జపాన్ లో ఓ మహిళ జోస్యం కలకలం రేపుతోంది. ఆమె సాదాసీదా జోస్యురాలు అయితే తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ, గతంలో ఆమె చెప్పినవి జరగడంతో ఇప్పుడు జపాన్ ప్రజలు వణికిపోతున్నారు.

వచ్చే నెల 5న (జూలై 5) జపాన్ లో భారీ భూకంపం సంభవిస్తుందని రియో టాట్సుకి అనే మహిళ చెబుతోంది. దీంతో ఆ దేశ ప్రజలు ప్రయాణాలు రద్దు చేసేసుకుంటున్నారు. జపాన్ వచ్చే పర్యాటకులూ ఆలోచనలో పడుతున్నారట. టాట్సుకిని జపాన్ బాబా వంగాగా పేర్కొంటుంటారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా.. అంధురాలు. అయినా, ఆమె కాలజ్ఞాని. తను ముందుగా చెప్పిన చాలా విషయాలు జరిగాయి. అందుకనే బాబా వంగాకు బాగా పేరుంది.

ఇక టాట్సుకి.. జూలై 5న జపాన్ ను భారీ విపత్తు కుదిపేస్తుందని చెబుతోంది. భూకంపాలు, సునామీ వస్తుందని హెచ్చరిస్తోంది. ఆమె అంచనా ప్రకారం.. జపాన్-ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన జరిగి భారీ భూకంపం లేదా సునామీ వస్తుందని జపాన్ ప్రజలు నమ్ముతున్నారు.

టాట్సుకీ 1995 నాటి కోబ్ ప్రళయానిన, 2011లో సంభవించిన తోహెకు భూకంపం గురించి ముందుగానే చెప్పింది. 2011లో ఏకంగా 22 వేల మంది జపనీయులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే టాట్సుకీ జోస్యాన్ని విశ్వసిస్తున్నారు.

ఇక జపాన్ కు వెళ్లాలనుకునే పర్యటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. హాంకాంగ్ నుంచి బుకింగ్ లు 83 శాతం తగ్గాయి.

టాట్సుకి అంచనాలు నిరాధారం అని అధికారులు కొట్టిపారేస్తున్నా.. ప్రజలకు మాత్రం ప్రాణభయం ఉంటుందిగా..? అంతేగాక ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కూడా పసిఫిక్ తీరంలో భారీ భూకంపం వస్తుందని అంచనా వేసింది. 2.98 లక్షల మంది చనిపోతారని పేర్కొంది. అంటే ముప్పు ఉందనేగా అర్థం. ఇక టాట్సుకీ 2020లో ఓ వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని చెప్పింది. ది ఫ్యూచర్ ఐ సా అనే పుస్తకం రాసింది. 2020 లో వచ్చిన వైరస్ ఏమిటో అందరికీ తెలిసే ఉంటుందిగా..?

Tags:    

Similar News