• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రష్యాని వణికించిన...

రష్యాని వణికించిన ఉక్రెయిన్... ఈ వీడియో చూసి తీరాల్సిందే!

| దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-29 16:23 GMT

రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటి 550 రోజులు దాటిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులైనా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతోంది. ఈ యుద్ధం ఫలితంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరిన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... అత్యంత బలమైన దేశంగా పేరున్న రష్యాను ఉక్రెయిన్ వణికిస్తోన్నట్లున్న ఉన్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అవును... ఆస్ట్రేలియాను వణికించిన పసికూన బంగ్లా అంటూ క్రికెట్ వార్తల్లో వచ్చే హెడ్డింగుల్లా.. ఒక ఇష్యూ వైరల్ అవుతోంది.

అవును... రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యంగా అని అంటున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ విషయం రష్యా పరిస్థితికి అద్దం పడుతుందని అంటున్నారు పరిశీలకులు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్.. రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు... ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారని సమాచారం.

అయితే ఇదేదో ఊహాజనిత విషయమో, కల్పిత గాథో కాదని తెలిసేలా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతిని తేటతెల్లం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో... ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్‌ లోని టోక్‌ మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు.

ఇలా వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. అంటే... పాప ప్రాణాన్ని అడ్డుపెట్టుకుని, పాప అక్కడున్నంత వరకు ఉక్రెయిన్ డ్రోన్లు తమపై దాడి చేయవని ప్లాన్ చేశారు. దీంతో.. వారి నమ్మకం ఉక్రెయిన్ సైన్యం యొక్క మానవత్వాన్ని నిరూపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనమతరం ఈ లోపు అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు.. పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు.. కాదు కాదు... ఉక్రెయిన్ దృష్టిలో పారిపోయారు. అయితే వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగపడిన పాప మాత్రం అక్కడే నిలుచుండిపోయింది. ఏది ఏమైనా... ఈ ఒక్క వీడియో రష్యా సైన్యం యొక్క దయణీయ పరిస్థితిని తేటతెల్లం చేస్తుందనే కామెంట్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

So many questions from this drone footage of Russian forces with a child near Tokmak ... pic.twitter.com/kPLP8qO3iz

— 🌻 Fertilizer Finder 🌻 (@ManiacMagic1) August 27, 2023
Tags:    
  • Russia 
  • Ukraine 
  • War 
  • Droneattacks 
  • Russianforce 
  • Tokmak 
  • Videoviral 
  • Attack 
  • Child 
  • Soldiers 
  • Vehicles 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS