• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రష్యా దగ్గర ‘డెడ్...

రష్యా దగ్గర ‘డెడ్ హ్యాండ్’ ఉంది.. అమెరికా జాగ్రత్త..

| యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అనంతరం రష్యా అనేక ఒడిదొడులకు లోనైంది. ఓ దశలో ప్రపంచంలో ఒంటరిగా మిగిలింది.

By - Tupaki Desk
Update: 2024-11-20 10:23 GMT

రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం అంచున ఉంది.. ఉక్రెయిన్ కు అందించిన దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు అమెరికా అనుమతివ్వడంతో పరిస్థితి అణు యుద్ధం వరకు వచ్చింది. దీంతో నాటో దేశాలు మరీ ముఖ్యంగా కొత్తగా చేరిన ఫిన్లాండ్, స్వీడన్ వణికిపోతున్నాయి. ఇక ఉక్రెయిన్ సైతం అమెరికా నుంచి అనుమతి వచ్చిందే ఆలస్యం.. రష్యాపైకి ఆరు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేసింది. ఇంత జరుగుతుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ చూస్తూ ఊరుకుంటారా? గట్టిగా బదులు తీర్చుకునేందుకు ఏదైనా చేయడం ఆయన నైజం. అందుకే ప్రపంచం యావత్తూ ఉత్కంఠంగా ఉంది.

అప్పట్లో సూపర్ పవర్

ఇప్పుడంటే రష్యా కాస్త తక్కువగా కనిపిస్తోంది కానీ.. ఒకప్పుడు అంటే.. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా (యూఎస్ఎస్ఆర్)గా ఉన్నప్పుడు దాని సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ సహా యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన 15 దేశాల్లో కొన్ని దేశాలు భూభాగంలో చాలా పెద్దవి. అయినప్పటికీ రష్యా ఇప్పటికీ ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. 1.72 లక్షల కోట్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భారత్ కు ఐదు రెట్లు ఉంటుంది రష్యా. దాదాపు రెండు అమెరికాల వైశాల్యం అంత అనుకోవాల. కాగా, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా, యూఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగి.. ప్రపంచంలోని దేశాలన్నీ చెరోవైపు నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, 1990ల మొదట్లో యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం కావడంతో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది.

అమెరికా బలపడింది.. రష్యా కుదేలైంది

యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అనంతరం రష్యా అనేక ఒడిదొడులకు లోనైంది. ఓ దశలో ప్రపంచంలో ఒంటరిగా మిగిలింది. అదే సమయంలో అమెరికా ఏకైక సూపర్ పవర్ గా ఎదిగింది. దీంతో రష్యాను సాధారణ దేశంగా పరిగణించడం మొదలుపెట్టారు. అయితే, ఎప్పుడైతే అత్యంత బలవంతుడైన, గట్టి నిర్ణయాలు తీసుకోగల పుతిన్ శకం ప్రారంభమైందో అప్పట్నుంచి రష్యా మళ్లీ గాడిన పడింది. ఒకప్పటి స్థాయిలో కాకున్నా.. అమెరికా వ్యతిరేక శక్తులైన చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ తదితర దేశాలను కలుపుకొని అమెరికాను సవాల్ చేయగల స్థితికి వచ్చింది.

భద్రతా సమస్య తలెత్తితే..

అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్తే ఎంత భద్రత ఉంటుందో అందరికీ తెలిసిందే. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే కమాండోలు విధుల్లో ఉంటారు. అయితే, రష్యా అధ్యక్షుడికీ అదే స్థాయిలో భద్రత ఉంటుందనే భావించాలి. కాగా, ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో దీర్ఘ శ్రేణి క్షిపణుల వాడకానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడంతో పరిస్థితి ఎక్కడకు వెళ్తుందో తెలియని పరిస్థితి.

ఆ డెడ్ హ్యాండ్ ప్రపంచాన్నే అంతం చేయగలదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమై అమెరికా నేరుగా రంగంలోకి దిగితే..? ఈ క్రమంలో పుతిన్ సహా రష్యా అగ్ర నాయకత్వాన్ని నాటో కూటమిలోని పాశ్యాత్య దేశాలు హతమారిస్తే? ఇదంతా జరగాలని కాదు కానీ.. ఒకవేళ జరిగితే...? అప్పుడు అది ప్రపంచానికే పెను ప్రమాదం అని చెప్పాలి. ఎందుకంటే రష్యా వద్ద డెడ్ హ్యాండ్ (పెరీమీటర్) అనే వ్యవస్థ ఉంది. ప్రపంచాన్ని అంతం చేయగల సత్తా దీని సొంతం అట.


బలగాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా

అమెరికా, నాటో కూటమి దాడిలో తమ బలగాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా.. రష్యా అధికారి ఎవరైనా ఒక్కరు పెరీ మీటర్ ను ఆపరేట్ చేస్తే చాలట.. రష్యా వద్ద ఉన్న అణ్వాయుధాలు మొత్తం శత్రు దేశాల మీదకు దూసుకెళ్తాయి. దీనికి కారణం ఏమంటే.. ‘‘మనమే పోయే పరిస్థితి వస్తే.. మనతో పాటు అందరూ పోవాలి’’ అనే సూత్రంతో సోవియట్ యూనియన్ కాలంలో ఈ వ్యవస్థను రూపొందించారట.

అణు పెద్దన్న రష్యానే..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అణు బాంబు దాడి విపరిణామాలు ఎలా ఉంటాయో అందరూ చూశారు. ఆ తర్వాత తమ వద్ద పోగైన అణ్వాయుధాలను ధ్వంసం చేయాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటికీ రష్యా వద్ద 5,500 అణు వార్ హెడ్స్ ఉన్నాయట. అమెరికా వద్ద ఉన్నవి 5,044. అంటే అణు పెద్దన్న రష్యానే.


Tags:    
  • Russia 
  • Deadhand 
  • Sovietrussia 
  • Russiaukrainewar 
  • Ukraine 
  • Unitedstates 
  • Valdmirputin 
  • Joebiden 

Similar News

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS