మోడీ పుట్టిన రోజుకు ముందే ఆర్ఎస్ఎస్ కీలక భేటీ !

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17న అన్నది అందరికీ తెలిసిందే ఆయన పుట్టిన రోజు ఈ సారి చాలా ప్రత్యేకం అని చెప్పాలి.;

Update: 2025-08-26 03:51 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17న అన్నది అందరికీ తెలిసిందే ఆయన పుట్టిన రోజు ఈ సారి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఆయనకు 75 ఏళ్ళు నిండుతాయి. 76వ ఏట అడుగు పెడతారు. అయితే ఇందులో విశేషం ఏముంది అన్నది ప్రశ్న కాదు. 75 ఏళ్ళు నిండిన వారు రాజకీయాల్లో కొనసాగరాదు, వారు హుందాగా తమ పదవుల నుంచి రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసింది అది మోడీ గురించే అని అంతా అంటున్న నేపథ్యం ఉంది.

పది రోజుల ముందే మీట్ :

ఇదిలా ఉంటే మోడీ పుట్టిన రోజుకు పది రోజుల ముందే ఆర్ఎస్ఎస్ కీలకమైన భేటీ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి 7వరకూ ఈ మీట్ ఉండబోతోంది. అంటే మూడు రోజులు అన్న మాట. నిజానికి చూస్తే ఇది ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశం. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఈ సమావేశాల నుంచి బీజేపీకి కానీ మోడీకి కానీ ఆర్ఎస్ఎస్ ఏమైనా సలహాలు సూచనలు ఇస్తుందా అని అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

అక్కడే సమావేశం :

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరిగే ఈ మూడు రోజుల మీటింగుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షత వహిస్తారు అని అంటున్నారు. ఇక ఈ వార్షిక సమావేశానికి బీజేపీతో పాటుగా ఏబీవీపీ భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్ సేవా సమితి వంటి అనుబంధ సంఘాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు అని చెబుతున్నారు.

బీజేపీ అధ్యక్ష ఎన్నిక పైన :

ఇక ఈ కీలక సమావేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికల మీద కూడా చర్చిస్తుంది అని అంటున్నారు గత నాలుగేళ్ళకు పైగా జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్లేస్ లో సంఘ్ కి చెందిన వారిని నిబద్ధతతో పార్టీని నడిపించే వారిని నియమించాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. ఆర్ ఎస్ ఎస్ మదిలో ఎన్నో పేర్లు ఉన్నాయి. బీజేపీ పెద్దలకు కొన్ని పేర్లు ఉన్నాయని అంటున్నారు దాంతో ఆర్ ఎస్ ఎస్ ఈ సమావేశం ద్వారా ఏమి చెబుతుంది అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

అమెరికా టారీఫ్ ల మీద కూడా :

అమెరికా భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించం అధిక టారీఫ్ లను విధించడం మీద ఆర్ఎస్ఎస్ సమావేశాలలో చర్చిస్తుంది అని అంటున్నారు. ఇక వర్తమన రాజకీయాల మీద కూడా ఆర్ఎస్ఎస్ చర్చిస్తుంది అని చెబుతున్నారు. మరి 75 ఏళ్ళకే రాజకీయ విరమణ చేయాలని ఆర్ఎస్ఎస్ మరోసారి గట్టిగా మాట్లాడుతుందా అన్నదే అసలైన పాయింట్. మొత్తానికి చూస్తే ఆర్ ఎస్ ఎస్ మీట్ మోడీ పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు జరగడంతో ఆసక్తి ఇంకా ఎక్కువ అవౌతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News