• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మనవడితో ముఖ్యమంత్రి...

మనవడితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హోలీ సంబరాలు!

| ఇదే సమయంలో తెలంగాణలోనూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

By - Tupaki Desk
Update: 2024-03-25 15:35 GMT

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పిల్ల పెద్దా, ముసలీ ముతకా అనే తారతమ్యాలేమీ లేకుండా... అంతా హోలీ సంబరాల్లో మునిగి తేలారు. ఇదే సమయంలో నేతలు తమ తమ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమక్షంలో హోలీ పండుగను జరుపుకోగా.. పలువురు సినీ తారలు, సెలబ్రెటీలూ వారి వారి హోలీ సంబరాలను సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకున్నారు.


ఇదే సమయంలో తెలంగాణలోనూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగితేలారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా... తన మనవడు రేయాన్స్, భార్య గీతారెడ్డితో కలిసి సంబరాలు చేసుకున్నారు.


ఈ సందర్భంగా సీఎం భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించగా.. రేయాన్స్ తన తాత ఒళ్లో కూర్చుని చిరునవ్వులు చిందించాడు. ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలను రేవంత్ తన "ఎక్స్"లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు... తీరిక లేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోలీ నాడు మనవడితో ఆటవిడుపు అని రాసుకొచ్చారు.

మరోవైపు హోలీ పండుగ రోజు తాము కూడా తాము పని చేసున్నాం అంటూ టీం తో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన రషిమ షేర్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపింది. ఇదే సమయంలో కియారా అద్వాణీ తన ఫ్యామిలీతో కలిసి పండుగ జరుపుకుంది. ఇందులో భాగంగా తన భర్త సిద్ధార్థ్ మలోత్రాతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.

పరిపాలన…
రాజకీయం…
విజ్ఞప్తులు…
పరిష్కారాలు…
సమావేశాలు…
తీరిక లేని షెడ్యూల్…
అన్నింటికీ కొంచం విరామం

హోళీ నాడు…
మనుమడితో ఆటవిడుపు.#HappyHoli2024 #Holi2024 #Holi pic.twitter.com/FCfazZgAyA

— Revanth Reddy (@revanth_anumula) March 25, 2024
Tags:    
  • Loksabhaelections 
  • Congressparty 
  • Bjp 
  • Brsparty 
  • Holicelebrations 
  • Holi2024 
  • Holifestival 
  • TSCM 
  • RevanthCM 
  • CmRevanthreddy 
  • Revanthreddy 
  • Rayan 
  • Geethareddy 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS