• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రేవంత్ రెడ్డికి లైన్...

రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్... !

| తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం అవుతోంది. ఈ మేరకు అనుమానపు మేఘాలు ఒక్కోటిగా తొలగిపోతున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-12-05 09:08 GMT

తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం అవుతోంది. ఈ మేరకు అనుమానపు మేఘాలు ఒక్కోటిగా తొలగిపోతున్నాయి. ఢిల్లీకి వచ్చిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మల్లు భట్టి విక్రమార్కలకు కూడా కాంగ్రెస్ పెద్దలు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు.

ఇక సుదీర్ఘంగా హై కమాండ్ తో చర్చిచి బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరు అన్న మీడియా ప్రశ్నకు నో కామెంట్ అని బదులిచ్చి వెళ్లిపోయారు. దాంతో పాటుగా ఆయన మరో మాట అన్నారు. అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని. సో అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో రేవంత్  రెడ్డికి అవకాశాలు మెరుగు అయ్యాయా అన్న చర్చ వస్తోంది.

అదే విధంగా భట్టి విక్రమార్క విషయంలో కూడా హై కమాండ్ సానుకూలంగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం గా చేయాలని చూస్తున్నారో కూడా వివరించే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఇక ఆయనకు కూడా పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందని, ప్రభుత్వంలో కీలక భూమిక ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి ఇవన్నీ చూస్తూంటే రేవంత్ రెడ్డికి సీఎం పోస్టు కన్ ఫర్మ్ అని దాదాపుగా ఢిల్లీలో రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారికి అందుతున్న సమాచారం. మరో వైపు చూస్తే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా వచ్చి చాలా సేపు చర్చలలో పాల్గొన్నారు అని అంటున్నారు.

రాహుల్ గాంధీ ఏమి చెప్పారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ ముందు చాలా టార్గెట్లు ఉన్నాయి. తెలంగాణలో కేసీయార్ ని నిలువరించడంతో పాటు లోక్ సభ ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఇదే టెంపోని కొనసాగించాల్సి రావడం అంతే కాదు అనేక రకాలుగా కాంగ్రెస్ కి తెలంగాణా నుంచి భవిష్యత్తులో అవసరాలు ఉన్నాయి.

ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచించే సీఎం ఎంపిక జరుగుతుంది అని అంటున్నారు.మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి పేరునే అధినాయకత్వం ప్రకటిస్తుంది అని అంటున్నారు. మరి మిగిలిన పోస్టులు ఎవరికీ కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికీ అన్నది కూడా కొలిక్కి వచ్చాక కీలక ప్రకటన వస్తుంది అని అంటున్నారు.

Tags:    
  • Telanganaelections 
  • Congress 
  • Telangana 
  • Politicalnews 
  • Revanthreddy 
  • Cheifminister 
  • Post 
  • Uttamkumarreddy 
  • Bhattivikramarka 
  • Delhi 

Similar News

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS