• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మేం తలుచుకుంటే పాకిస్తాన్...

మేం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచపటంలో ఉండదు: రేవంత్ మాస్ వార్నింగ్

| భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూసే వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని ఆయన స్పష్టం చేశారు.

By - Tupaki Desk
Update: 2025-05-08 17:06 GMT

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే దేశాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూసే వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని ఆయన స్పష్టం చేశారు. మా వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్‌ని రాత్రికి రాత్రే మట్టిలో కలిపేస్తారని హెచ్చరించారు.

- సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు:

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘"పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పాలకులు లేదా అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూసి, భారత్ వైపు కన్నెత్తి చూస్తే, వారు ఈ భూమిపై జీవించే అర్హత కోల్పోతారు." అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటించడం భారతీయ స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అన్నారు.

‘‘మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ భారతీయులు శాంతిని కోరుకుంటున్నారని, తమ శాంతి కాంక్షను చేతగానితనంగా భావించి, భారత్‌ భూభాగంలో కాలుమోపి, ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేయాలని చూస్తే, దానికి 'ఆపరేషన్ సిందూర్' సమాధానం చెబుతుందని’’ రేవంత్ హెచ్చరించారు. ఉగ్రవాదులను నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని, వారికి 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని ఈ ర్యాలీ ద్వారా సందేశం ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- హైదరాబాద్‌లో భారీ సంఘీభావ ర్యాలీ:

భారత సైన్యానికి సంఘీభావంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు ఈ ర్యాలీ సాగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీ విజయశాంతి, సచివాలయ ఉద్యోగులు, మాజీ సైనికాధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత జాతీయ జెండాలను చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

మా వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్‌ని రాత్రికి రాత్రే మట్టిలో కలిపేస్తారుమేము గాంధీ బిడ్డలం.. శాంతిగా ఉంటామని మా చేతకాని తనం అనుకోకండి - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/mH6Q2l7Lq5

— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025
Tags:    
  • RevanthReddy 
  • IndianArmy 
  • HyderabadRally 
  • Solidarity 
  • SayNoToTerrorism 
  • TelanganaGovernment 
  • PahalgamMartyrs 

Similar News

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

Copyright @2026

Powered by Blink CMS