టీడీపీ గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూడండి !
తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.;
తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2017 లోనే తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళారు. అంటే ఇప్పటికి ఏకంగా ఎనిమిదేళ్ళు అన్న మాట. అలాంటిది టీడీపీ మీద ఆయనకు ఇంకా ఆ ప్రేమ అభిమానం అలాగే గుండెలలో ఉందా అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే చూడండి అంటున్నారు. అఫ్ కోర్స్ ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఆ కృతజ్ఞత ఆయనకు ఉండొచ్చు. అయితే ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది కూడా చూస్తే ఆసక్తికరమైన చర్చగానే ఉంది మరి.
అద్భుతమైన పార్టీ అంటూ :
తెలుగుదేశం పార్టీ అద్భుతమైనది అంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం హోదాలో ఉంటూ ఆకాశానికి ఎత్తడం నిజంగా ఒక రాజకీయ సంచలనమే. ఆయన టీడీపీ గురించి మాట్లాడుతూ ఆ పార్టీ ఎంతో మందికి ఎన్నో రకాలైన అవకాశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆ పార్టీ తెలంగాణా ప్రస్తుతం సమస్యలు ఎదుర్కోంటోందని సాఫ్ట్ కార్నర్ కూడా చూపించారు. దానికి కారణం కొందరు చేసిన కుట్రలు అన్నారు
బీఆర్ఎస్ మీదనేనా :
ఆ కుట్రలు చేసిన వారిని ప్రకృతి తన ధర్మం ప్రకారం వదిలిపెట్టడం లేదని అందుకే వారు ఇపుడు తగిన విధమైన శిక్షను అనుభవిస్తున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణాలో ఏ పార్టీ బతకనీయకుండా చేసినందుకు బీఆర్ఎస్ ఈ రోజున ఆ పాపం అనుభవిస్తోంది అని రేవంత్ రెడ్డి అన్నారు. తొందరలోనే బీఆర్ఎస్ తెలంగాణాలో కనుమరుగు అవుతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు.
అక్రమ కేసులు పెట్టారు :
ఒకపుడు ఇతర పార్టీలు అసలు బతకకూడదు అని అక్రమం కేసులు పెట్టారు అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద ఘాటు విమర్శలు చేశారు. వాటి ఫలితాలను ఈ రోజు చవి చూస్తున్నారు అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్న వారు అంతా ఇపుడు వారిలో వారే తన్నుకుంటున్నారు అన్నారు. వారిని ఒకరు ప్రత్యేకించి కొట్టలసిన అవసరం లేదని వారే కొట్టుకుని ఇబ్బందులు పడతారు అన్నారు. అవినీతి సొమ్ము విపరీతంగా పోగులు వేసుకోవడంతో ఇపుడు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చి కొత్త పంచాయతీలు పుట్టుకుని వస్తున్నాయని అన్నారు.
లోపల అలాగే ఉందా :
అయితే రేవంత్ రెడ్డి తన ఆరోపణలు అన్నీ బీఆర్ ఎస్ మీదనే చేశారు. ఆ పార్టీనే ఆయన కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే ఆయన అదే సమయంలో తెలుగుదేశం పార్టీని పొగడడం మాత్రం చర్చకు తావిస్తోంది. అద్భుతమైన పార్టీ అని కితాబు ఇవ్వడం మీద బీఆర్ఎస్ నుంచే ప్రతి విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ఈ తరహా ప్రకటనల వల్ల కాంగ్రెస్ నేతలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తోంది అని అంటున్నారు.
అయితే రేవంత్ రెడ్డి చెప్పినది ఏమిటి అంటే ఇతర పార్టీలను లేకుండా చేయాలనుకున్న బీఆర్ఎస్ రాజకీయ తంత్రం ఈ రోజు ఎదురు తన్ని ఆ పార్టీకే ఇబ్బందిగా మారిందని. ఆయన ఆ విషయం చెబుతూనే టీడీపీని నేరుగా ప్రస్తావించడం, గొప్ప పార్టీగా కీర్తించడంలో ఆయన ఓపెన్ మైండ్ అర్ధం అవుతోంది కానీ అదే సమయంలో ఆయన వ్యాఖ్యల పట్ల మాత్రమే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.