నాడు కేసీఆర్‌.. నేడు కిష‌న్ రెడ్డి.. మెట్రో సైంధ‌వులు: రేవంత్‌

గ‌త ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్‌.. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి.. మెట్రో రైలు విస్త‌ర‌ణ‌కు అడు ప‌డుతున్నార‌ని.. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Update: 2026-06-15 11:28 GMT

గ‌త ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్‌.. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి.. మెట్రో రైలు విస్త‌ర‌ణ‌కు అడు ప‌డుతున్నార‌ని.. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరిద్ద‌రు సైంధ‌వుల్లా మారి మెట్రోకు అతీగ‌తీ లేకుం డా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మెట్రో విస్త‌ర‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. గ‌త ప్ర‌భు త్వంలో మెట్రో విస్త‌ర‌ణ ప్ర‌జ‌ల కోసం కాద‌ని.. కొంద‌రి కోసం చేప‌ట్టార‌ని సీఎం విమ‌ర్శ‌లు గుప్పించారు. వాస్త‌వానికి ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న‌లో నే మెట్రో ప‌నులు చేప‌ట్టార‌ని గుర్తు చేశారు.

కానీ, కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత‌.. అలైన్‌మెంట్లు మార్చి.. దానిని గంద‌ర‌గోళానికి గురి చేసి.. ఆల‌స్యం చేశా ర‌ని అన్నారు. త‌ద్వారా.. మెట్రో ప‌నులు ఆల‌స్య‌మై.. 7 వేల కోట్ల రూపాయ‌లు అద‌నంగా భారం ప‌డింద న్నారు. అయినా.. మెట్రో ప్ర‌జ‌ల కోసం పెద్ద‌గా ప్ర‌యోజ‌నాలు చేకూర్చిందా? అనేది ఆలోచించాల్సి న విష‌యంగా చెప్పారు. నాడు కేసీఆర్ అలా చేస్తే.. నేడు.. కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిష‌న్ రెడ్డి కూడా మెట్రోకు అడ్డు ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

మెట్రో విస్త‌రిస్తే.. ఆ క్రెడిట్ కాంగ్రెస్‌పార్టీ ఖాతాలో ప‌డుతుంద‌ని.. దీనివ‌ల్ల తెలంగాణ‌లో బీజేపీ భూస్థాపి తం అవుతుంద‌ని కిష‌న్ రెడ్డి బ‌లంగా న‌మ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు చెప్పి.. రెండో ద‌శ మెట్రో విస్త‌ర‌ణ ప‌నుల‌కు రుణం ద‌క్క‌కుండా చేస్తున్నార‌ని సీఎం ఆరోపించా రు. ఇలా చేయ‌డం సమంజ‌స‌మా? అని నిల‌దీశారు. కేసీఆర్ నిర్వాకంతోనే ఎల్‌.. అండ్ టీ సంస్థ‌.. త‌మ‌కు న‌ష్టాలు వ‌చ్చాయ‌ని పేర్కొంద‌న్నారు.

ఏటా రూ.400 కోట్ల రూపాయ‌లకు పైగా నష్టం వస్తోందని చెప్పిన‌ట్టు తెలిపారు. దీంతో రెండో ద‌శ నుంచి ఎల్‌.. అండ్ టీ సంస్థ త‌ప్పుకొంద‌న్నారు. ఫ‌లితంగా 15 వేల కోట్ల‌కు మెట్రో కొనుగోలు చేసి.. రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు ముందుకు అడుగులు వేశామ‌న్నారు. దీనికి గాను రుణం తీసుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలిపారు. ఐఆర్ ఎఫ్ సీ కింద‌.. 13 వేల కోట్ల రూపాయ‌ల‌ను రుణంగా తీసుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాక‌. కొంత‌మేర‌కు ఫీజులు కూడా చెల్లించిన త‌ర్వాత‌.. దీనిని నిలుపుద‌ల చేశార‌ని.. దీనివెనుక కిష‌న్ రెడ్డి ఉన్నార‌ని సీఎం ఆరోపించారు.

Tags:    

Similar News