రెడ్ల రాజకీయం: నిజం.. వారంతా గ్రూపు కట్టేశారు.. !
రెడ్డి సామాజిక వర్గంలో కీలక నేతలు... పారిశ్రామిక వేత్తలు గ్రూపులు కట్టారా? వారంతా.. మరో సామాజిక వర్గంతో మిలాఖత్ అయ్యారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.;
రెడ్డి సామాజిక వర్గంలో కీలక నేతలు... పారిశ్రామిక వేత్తలు గ్రూపులు కట్టారా? వారంతా.. మరో సామాజిక వర్గంతో మిలాఖత్ అయ్యారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయాలు ఏకపక్షం గా ఉన్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు భిన్నంగా ఉన్న రాజకీయాలు.. కనిపించాయి. అంటే.. ఎవరు ఏ పార్టీ లో ఉన్నా.. ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా.. ఎంతో కొంత పనులు జరిగేవి. కానీ... 2019 నుంచి వైసీపీ అధికారం లోకి ఉన్న ఐదేళ్లు కూడా.. పరిస్థితి మారిపోయింది.
తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే పనులు చేసే సంస్కృతి వచ్చింది. ఇది ప్రమాదకరమని ఆ నాడే రాజకీయ పండితులు చెప్పుకొచ్చారు. అయితే.. ఆ నాడు.. వైసీపీ మాత్రం తనకు నచ్చిన మార్గంలో నే ముందుకు సాగింది. తనకు జై కొట్టిన వారికే పనులు చేసింది.. బిల్లులు ఇచ్చింది. ఇది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం జగన్ చెబుతున్న `విత్తనం` రాజకీయం.. అప్పట్లోనే మొదలైంది. ఇక, ఇప్పు డు రెండే వర్గాలుగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులుగా ఉన్న రెడ్లు చీలిపోయారన్నది వాస్తవం.
ఉంటే వైసీపీ, లేకపోతే.. టీడీపీ కూటమికి మద్దతు తెలపాల్సిన రాజకీయం ముసురుకుంది. ఈ నేపథ్యం లోనే వైసీపీకి మద్దతుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం తగ్గుతూ వచ్చింది. పైగా.. ఇప్పుడు రెడ్లు కూడా వర్గాలు గా విభజితమయ్యారన్నది లోకల్‌గా అన్ని జిల్లాల్లోనూ వినిపిస్తున్న మాట. వైసీపీలో ఉన్నా.. టీడీపీకి అను కూలంగా చక్రం తిప్పడం.. లేదా..వైసీపీ తరఫున నోరు విప్పకుండా జాగ్రత్త పడడం అనే ఫార్ములాను రెడ్డి సామాజిక వర్గం పాటిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలుగా ఉన్న రెడ్లు పూర్తిగా వన్ సైడ్ అయిపోయార న్నది స్పష్టంగా కనిపిస్తోంది.
``మేం గ్రూపులుగా ఉన్నామన్నది కరెక్టుకాదు. రాజకీయంగా పార్టీలు, ప్రభుత్వాలు మారినప్పుడు.. సహజం గానే మాపై ఒత్తిడి ఉంటుంది. దీనికి అనుగుణంగానే మేం అడుగులు వేస్తాం. దీనిని వేరే కోణంలో చూడా ల్సిన అవసరం లేదు.`` అని నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నేత, పారిశ్రామిక వేత్త కూడా అయిన.. ఓ కీలక నాయకుడు చెప్పారు. ఈయనకు చాలానే వ్యాపారాలు ఉన్నాయి. వైసీపీ నాయకులు ఈయనతో కలిసి లావాదేవీలు చేస్తున్నారన్నది తాజాగా వెలుగు చూసిన విషయం. ఈ ఒక్క జిల్లానేకాదు.. దాదాపు రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గం.. కూటమి నాయకులతో టచ్‌లోనే ఉంది. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పరిస్థితి అలాంటిది... అంటున్నారు పరిశీలకులు.