హాలీవుడ్ సినిమా తరహాలో భారీ మోసం..ఆటిజం పేరిట 37 ఏళ్ల మహిళ గుట్టు రట్టు!

నిజానికి ఆమెకు 37 ఏళ్లు కావడంతో ముఖంలో కాస్త పెద్దరికం కనిపించేది. దీనిపై ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ఒక వింత కథ అల్లింది.

Update: 2026-06-09 12:30 GMT

జనాన్ని మోసం చేయడానికి కొంతమంది ఎలాంటి ఘాతుకాలకైనా తెగబడుతున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘ఆర్ఫన్’ లో ఒక పెద్ద వయసు మహిళ చిన్నపిల్లలా నటించి ఒక కుటుంబాన్ని మోసం చేస్తుంది. సరిగ్గా ఇలాంటి విస్తుపోయే ఘటనే బ్రెజిల్‌లో రియల్ లైఫ్‌లో జరిగింది. ఒక 37 ఏళ్ల మహిళ.. తనకు 12 ఏళ్లని, ఆటిజం వ్యాధి ఉందని అబద్ధాలు చెప్పి ఒక మంచి కుటుంబాన్ని ఏకంగా 14 నెలల పాటు నమ్మించి మోసం చేసింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..

ఆటిజం బాలికగా డ్రామా:

బ్రెజిల్‌కు చెందిన ఒక ధనిక కుటుంబం ఉదారతతో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంది. ఇదే అడ్డుగా పెట్టుకుని సదరు కిలాడీ మహిళ రంగంలోకి దిగింది. తనకు కేవలం 12 సంవత్సరాలేనని, ఆటిజం బాధితురాలినని నమ్మించింది. ఇక ఆ కుటుంబం కూడా జాలితో ఆమెను తమ ఇంటికి తెచ్చుకుని సొంత బిడ్డలా చూసుకోవడం ప్రారంభించింది.

వృద్ధాప్య ఛాయలపై క్రేజీ అబద్ధం:

నిజానికి ఆమెకు 37 ఏళ్లు కావడంతో ముఖంలో కాస్త పెద్దరికం కనిపించేది. దీనిపై ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ఒక వింత కథ అల్లింది. చిన్నతనంలో జరిగిన కొన్ని శారీరక గాయాల కారణంగా, తన శరీరంలో హార్మోన్ల మార్పులు వచ్చి వృద్ధాప్య చాయలు త్వరగా కనిపిస్తున్నాయని నమ్మబలికింది. ఇక అమాయకపు చూపులతో, చిన్నపిల్లల మాటలతో ఏకంగా 14 నెలల పాటు ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేసింది.

గుట్టురట్టు.. జైలుపాలు:

అయితే ఎన్ని రోజులు నటించినా అసలు నిజం దాగుతుందా? ఆమె ప్రవర్తనలో రోజురోజుకూ వస్తున్న మార్పులు, కొన్ని అలవాట్లను గమనించిన ఆ కుటుంబ సభ్యులకు గట్టి అనుమానం వచ్చింది. దీంతో వారు రహస్యంగా మెడికల్ టెస్టులు, పోలీసుల ద్వారా విచారణ జరిపించగా అసలు రంగు బయటపడింది. ఆమెకు 37 ఏళ్లు ఉన్నాయని, ఎలాంటి ఆటిజం వ్యాధి లేదని తేలడంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది. ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కిలాడీ లేడీని అరెస్ట్ చేశారు.

సమాజంలో మనుషుల మంచిదనాన్ని, జాలిని ఆసరాగా చేసుకుని ఇలాంటి ఘోరమైన మోసాలకు పాల్పడటం నిజంగా బాధాకరం. సినిమా కథలను మించిపోయిన ఈ రియల్ లైఫ్ మోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన తర్వాత ఎవరినైనా దత్తత తీసుకోవాలన్నా, నమ్మాలన్నా జనాలు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News