దేశంలో డిజిటల్ కరెన్సీ.. ఎలా ఉంటుంది? ఏం చేయాలి?
ఇక, ఇప్పుడు ఆర్బీఐ మరో రూపంలో కరెన్సీని తీసుకువస్తోంది. అదే డిజిటల్ కరెన్సీ. ఇది కూడా డిజిటల్ రూపంలోనే ఉంటుంది.
దేశవ్యాప్తంగా నగదు చలామణిలోనూ సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో నగదు ను నేరుగా ఇచ్చిపుచ్చుకునే స్థానంలో ఇప్పుడు గత దశాబ్ద కాలంగా యూపీఐ లావాదేవీలు అందుబాటు లోకి వచ్చాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా నగదు చలా మణి దాదాపు తగ్గింది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి.
ఇక, ఇప్పుడు ఆర్బీఐ మరో రూపంలో కరెన్సీని తీసుకువస్తోంది. అదే డిజిటల్ కరెన్సీ. ఇది కూడా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అయితే.. నేరుగా నోట్ల మాదిరిగా మనకు.. కనిపిస్తుంది. దీనివల్ల నగదు లావాదేవీ లు నేరుగా చేసిన అనుభూతి కలగడంతోపాటు.. ఎక్కడా తేడా రాకుండా కూడా ఉంటుందని భావిస్తున్నా రు. దీనిని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు. దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును పైలట్‌గా అమలు చేశారు. అంటే.. నేరుగా కరెన్సీని చేతికి ఇవ్వ కుండా.. డిజిటల్ రూపంలో ఉన్న కరెన్సీని.. బదిలీ చేస్తారు. ఒక రకంగా దీనిని ప్లాస్టిక్ కరెన్సీ అని పిలవచ్చు. గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో ఈ నగదు చలామణి సక్సెస్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా దీనివల్ల.. నగదు ముద్రణ ఖర్చు తగ్గడంతోపాటు.. మరింత పారదర్శక సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఎలా వినియోగించాలన్న విషయంపై ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్పష్టత ఇచ్చింది. సాధార ణంగా మనకు ఉన్న కరెన్సీ ప్రస్తుతం అంకెల రూపంలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీని ని నోట్లలో చూపిస్తుంది. ఇది బదిలీ క్రమంలోనూ అలానే ఉంటుంది. అంటే.. అంకెల రూపంలో ఇచ్చే నగదుస్థానంలో డిజిటల్ కరెన్సీ మనకు కనిపిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఎంపిక చేసేన సంస్థల ద్వారా మాత్రమే ఈ నగదు కరెన్సీకి అవకాశం ఉంటుంది.