ఎయిరిండియా విమానంలో శిశువు జననం... వారికి స్పెషల్ థాంక్స్!

అవును... ఒమన్‌ రాజధాని మస్కట్‌ నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌ విమానంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.;

Update: 2025-07-24 17:37 GMT

గత కొన్ని రోజులుగా విమానాలకు సంబంధించి తెరపైకి వస్తోన్న చాలా వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కూలిన విమానం అని, విమానంలో సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అని రకరకాల వార్తలు ఆందోళన కలిగించగా... తాజాగా ఓ అరుదైన, శుభ సంఘటన జరిగింది! ఇందులో భాగంగా.. విమానంలో ఓ శుశువు జన్మించింది!

అవును... ఒమన్‌ రాజధాని మస్కట్‌ నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్‌ విమానంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. విమానంలో థాయిలాండ్ కు చెందిన ప్రయాణికురాలు ఒకరు ప్రసవ వేదన చెందారని.. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగానే ఆరోగ్యకరమైన మగ బిడ్డకు జన్మనిచ్చారని ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇటువంటి అత్యవసర పరిస్థితులకు శిక్షణ పొందిన క్యాబిన్ సిబ్బంది.. సందర్భానికి అనుగుణంగా స్పందించి ప్రసవానికి సహాయం చేయగా.. అదే సమయంలో విమానంలో ఉన్న ఒక నర్సు నుండి సకాలంలో సహాయం అందిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా.. క్యాబిన్ సిబ్బందికి, ఆ నర్సుకు స్పెషల్ థాంక్స్ అనే మాటలు వినిపిస్తున్నాయి!

విమానం గాల్లో ఉన్న సమయంలో... థాయ్ జాతీయురాలు ప్రసవ వేదనకు గురైనప్పుడు, సిబ్బంది త్వరగా ప్రసవానికి అవసరమైన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించారని.. పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడంలోనూ.. తల్లి, బిడ్డా భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడంలో తమ సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కీలక పాత్ర పోషించిందని ఎయిర్‌ లైన్ చెప్పుకుంది!

ఈ క్రమంలో... విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లి, బిడ్డను తదుపరి సంరక్షణ కోసం అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్... ఈ అసాధారణ క్షణం సిబ్బంది సంసిద్ధతను మాత్రమే కాకుండా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ను నిర్వచించే టీమ్ స్పిరిట్ ను కూడా హైలైట్ చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News