కొత్త ఐక్యరాజ్యసమితి కావాలి... భారత్ డిమాండ్ వెనక !

ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి వైపు నుండి ఎటువంటి భరోసాని ప్రపంచం అశిస్తుందో ఆయన పేర్కొంటూ.;

Update: 2025-11-23 03:40 GMT

ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం వహించేందుకు ఉమ్మడి వేదికగా ఐక్య రాజ్య సమితి ఉంది. దీని వయసు కూడా ఎనిమిది పదులు దాటింది. స్వాతంత్య్రానికి పూర్వం నానా జాతి సమితి ఉండేది. ఆ తరువాత మరిన్ని దేశాల ఆశలు ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకుని ఐక్య రాజ్యసమితిగా విస్తరించారు అయినా సరే గడచిన కాలంలో ఐక్య రాజ్య సమితి ఏ మేరకు ప్రపంచ అవసరాలకు చిన్న దేశాలు మధ్యే వాద దేశాలను కలుపుకుని పనిచేసింది అంటే కనుక జవాబు కొంత నిరాశగానే వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఐక్య రాజ్య సమితి మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్ర దేశాలు కొన్ని మాత్రమే నియంత్రిస్తున్నాయని వాటికి లోబడే పనిచేస్తోంది అన్న ఆరోపణలూ ఉన్నాయి.

కొత్త ప్రపంచానికి అంటూ :

ఈ నేపథ్యంలో ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడానికి నేటి కొత్త ప్రపంచానికి కొత్త ఐక్యరాజ్యసమితి అవసరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పడం విశేషం. లక్నోలో జరిగిన ప్రపంచ ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-హమాస్ ఉక్రెయిన్-రష్యా వంటి ప్రపంచ సంఘర్షణల నేపధ్యం, అలాగే సూడాన్‌లో బయటపడుతున్న మానవతా సంక్షోభాలలో ఐక్య రాజ్య సమితి పాత్ర ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరింత బలమైన పాత్ర పోషించి ఉండాల్సింది అన్న భావనను వ్యక్తం చేయడం విశేషం.

తరచుగా ప్రశ్నలు :

ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి వైపు నుండి ఎటువంటి భరోసాని ప్రపంచం అశిస్తుందో ఆయన పేర్కొంటూ. ఈ అంతర్జాతీయ సంస్థను సజీవంగా ఉంచడానికి ఐక్యరాజ్యసమితిలో సమతుల్య ప్రాతినిధ్యం అవసరం అన్నారు అలాగే ప్రస్తుత కాలానికి అవసరమైన మార్పులు కూడా ఉండాలని రక్షణ మంత్రి అన్నారు. ఐక్యరాజ్యసమితిని దాని ప్రధాన లక్ష్యాలు ఏమిటో ఆయన వివరిస్తూ శాంతి, న్యాయం సమాన ప్రాతినిధ్యం వైపుగా గట్టిగా పనిచేయాల్సి ఉందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితిని తిరిగి తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఐక్య రాజ్యసమితి విషయంలో గణనీయమైన మార్పుని చూడగలమని అన్నారు.

భారత్ నుంచే నేర్వాలి :

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులలో భారతదేశం నాగరికత విధానం నుండి మొత్తం ప్రపంచం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి చెప్పడం విశేషం. భారతదేశం ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాన్ని గౌరవిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా సంక్షోభం ఎదురైనప్పుడు భారతదేశం హృదయపూర్వకంగా సహాయం చేయడానికి ముందుకొస్తుందని ఆయన అన్నారు. భారతదేశ విధానం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. న్యాయం కేవలం ఒక నియమం కాదు, అది ఒక మతం అని కూడా ఆయన చెప్పడం విశేషం. అలాగే, శాంతి కేవలం ఒక విధానం కాదు అది ఒక సంప్రదాయమని, ప్రపంచ సామరస్యం అంటే కేవలం దౌత్యం కాదు, అది ఒక సంస్కృతి అని రాజ్ నాధ్ సింగ్ కొత్త నిర్వచనాలు ఇచ్చారు ఇవన్నీ పక్కన పెడితే ఐక్య రాజ్యసమితి తీరు తెన్నులు మారాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇపుడు అదే మాటని కేంద్ర మంత్రి కూడా చెప్పారు. లేకపోతే కొత్త ఐక్య రాజ్యసమితి అవసరం కూడా పడుతుందని కూడా భావించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News