సోనియాతో రాజీవ్ ప్రేమ ఎక్కడ ఎలా మొదలైంది ?

ఇంతటి ఘన చరిత్ర కలిగిన రాజీవ్ గాంధీ తన విద్యార్ధి జీవితం మాత్రం అందరి మాదిరిగానే సాదా సీదాగా గడిపారు. ఆయన జీవితంలోనూ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.

Update: 2026-08-20 09:30 GMT

రాజీవ్ గాంధీ ఈ దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధానిగా సేవ చేసిన వారు. యువ ప్రధానిగా కేవలం 40 ఏళ్ళకే బాధ్యతలు స్వీకరించడమే కాకుండా దేశాన్ని సాంకేతికంగా పరంగా పరుగులు తీయించిన వారు. ఆయన హయాంలోనే ఐటీకి బీజం పడింది. టెలి కమ్యూనికేషన్ రంగం కూడా విస్తరించింది. యువతకు కొత్త అవకాశాల కోసం రాజీవ్ గాంధీ తన పాలనలో ఎంతగానో కృషి చేశారు ఇక ఆయన మామూలు నాయకుడు కాదు, తల్లి శ్రీమతి ఇందిరాగాంధీ పదహారేళ్ళ పాటు ఈ దేశాన్ని పాలించిన ఉక్కు మహిళ అయితే తాత పదిహేడేళ్ల పాటు ఈ దేశాన్ని పాలిచిన పండిట్ నెహ్రూ. ఆయన దేశానికి తొలి ప్రధాని కూడా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రాజీవ్ గాంధీ తన విద్యార్ధి జీవితం మాత్రం అందరి మాదిరిగానే సాదా సీదాగా గడిపారు. ఆయన జీవితంలోనూ ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.

తొలి చూపులోనే ప్రేమ :

ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ప్రేమకథ 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ నగరంలో ఒక గ్రీకు రెస్టారెంట్‌లో మొదలైంది. రాజీవ్ అక్కడ ఇంజనీరింగ్ చదువుతుండగా సోనియా ఆయనకు పరిచయం అయ్యారు. ఆమె ఇటలీ నుంచి వచ్చి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఒక రెస్టారెంట్‌లో పార్ట్ టైం పనిచేసేవారు. ఇక రాజీవ్ గాంధీ సోనియాను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడ్డారు. ఆ మీదట ఆమె తన తన జీవిత భాగస్వామి అని ఆనాడే ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇక కేంబ్రిడ్జ్‌లోని ఒక రెస్టారెంట్‌లో రాజీవ్ తన స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు సోనియాను మొదటిసారి చూశారు అలా ఆ రెస్టారెంట్ యజమాని ద్వారా సోనియాతో రాజీవ్‌కు పరిచయం ఏర్పడింది అని చెబుతారు.

సాధారణ విద్యార్థిగానే :

భారత్ లో అప్పటికే ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు. ప్రధాని కుమారుడిగా కాకుండా రాజీవ్ రాజకీయాలకు దూరంగా సాధారణ విద్యార్థిగానే అక్కడ ఉన్నారు. అలాగే సోనియాతో స్నేహం చేశారు. ఆ తరువాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న మీదట పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. . ఇందిరా గాంధీని సోనియా మొదటిసారి కలిసినప్పుడు ఆమె సాదరంగా స్వాగతించారు. కోడలిగా అనుమతించారు. అలా ఇరువురి కుటుంబాల అంగీకారంతో 1968లో వీరి వివాహం అత్యంత సాదా సీదాగానే ఢిల్లీలో జరిగింది. నిజానికి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న ఆ సమయంలో ఎంతో వైభవంగా చేయవచ్చు. కానీ అలా చేయకపోవడం వారి నిరాడంబరతను చాటి చెబుతునంది.

సోనియా ఆత్మ కధలో విశేషాలు :

ఇదిలా ఉంటే రాజీవ్ గాంధీ గురించిన పూర్తి వివరాలు ఎన్నో ఆసక్తికరమైన ఉదంతాలు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథను బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌' పేరుతో రాసిన పుస్తకంలో ఉండవచ్చు అని అంటున్నారు. ఈ పుస్తకాన్ని సోనియా గాంధీ నవంబర్ 10న విడుదల చేస్తున్నారు. ఇటలీలో ఆమె బాల్యం అంతే కాదు రాజీవ్ గాంధీతో ప్రేమ, వివాహం అనంతరం భారత్‌లో ఆరు దశాబ్దాల ప్రయాణం, కుటుంబ విషాదాలు రాజకీయ ప్రవేశం తదితర కీలక అంశాలను ఈ పుస్తకం సోనియా గాంధీ వివరించనున్నారు. ఈ పుస్తకంలో 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో కేవలం 19 ఏళ్ల విద్యార్థినిగా ఉన్నప్పుడు సోనియా రాజీవ్ గాంధీతో పరిచయం ప్రేమ ఆ తర్వాత మూడేళ్లకు వివాహం జరగడం వంటివి ఉంటాయని అంటున్నారు.

భారతీయ మహిళగా :

ఇక వివాహం అనంతరం సోనియా పూర్తి భారతీయ మహిళగా తనను తాను మలచుకున్నారు. భారతీయ సంస్కృతిని ఆమె అలవరచుకున్నారు. అంతే కాదు అప్పటి ప్రధాని తన అత్త అయిన ఇందిరా గాంధీతో పరిచయం ఆ మీదట హిందీ నేర్చుకోవడం చీరలు కట్టుకోవడం భారతీయ వంటకాలను అలవాటు చేసుకోవడం ఇలాంటివి అన్నీ అందులో పొందుపరుస్తారు అని అంటున్నారు. అదే సమయంలో గాంధీ కుటుంబంలో విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రాజీవ్ తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాద మరణం అలాగే 1984లో ఇందిరా గాంధీ హత్య ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని కావడం ఆయన కూడా 1991లో హత్యకు గురవడం ఇవన్నీ పుస్తకంలో ప్రస్తావనకు వస్తాయి అంటున్నారు.

ప్రత్యేక అధ్యాయంగా :

ఇక సోనియా గాంధీ రాజకీయ ప్రయాణం ఒక ప్రత్యేక అధ్యాయంగా ఉండబోతోంది. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినా ఇబ్బందుల మధ్యలోకి రావడం 2004 ఎన్నికల విజయం తర్వాత ప్రధాని పదవిని నిరాకరించడం వంటి అంశాలను ఆమె స్పష్టంగా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సోనియా గాంధీ ఆత్మకథ ఆమె జీవిత విశేషాల గురించి మరింత సమాచారం ఆ పుస్తకం రిలీజ్ అయిన తరువాతనే అందరికీ చేరనుంది. ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే ఆయన 1944 ఆగస్టు 20న జన్మించారు. ఆయన జయంతి ఈ రోజు.

Tags:    

Similar News