• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎడారి రాష్ట్రంలో కాక.....

ఎడారి రాష్ట్రంలో కాక.. సీఎం, మాజీ సీఎం, సీఎం క్యాండెట్ కు టికెట్లు

| వరుసగా రెండోసారి ఏ పార్టీనీ ఆదరించే కల్చర్ లేని ఆ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు కీలక పరిణామాలకు దారితీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికీ టికెట్లు రావడం ప్రాధాన్యంగా మారింది.

By - Tupaki Desk
Update: 2023-10-21 12:13 GMT

భౌగోళికంగా భిన్నమైన ఆ రాష్ట్రంలో ఎన్నికల కాక పెరిగింది. నిన్నమొన్నటివరకు వైరి వర్గాలుగా ఉన్న సీఎం, మాజీ డిప్యూటీ సీఎంలు ఒకే రాగం పాడుతుండగా.. అసలు మాజీ సీఎంకు టికెట్ వస్తుందో రాదోననే ఊహాగానానిని తెరపడింది. వరుసగా రెండోసారి ఏ పార్టీనీ ఆదరించే కల్చర్ లేని ఆ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు కీలక పరిణామాలకు దారితీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికీ టికెట్లు రావడం ప్రాధాన్యంగా మారింది.

ఒకే రోజు.. రెండు పార్టీల జాబితాలు

200 సీట్లున్న రాజస్థాన్ లో ప్రస్తుతం అశోక్ గెహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆయనకు మూడేళ్ల కిందటివరకు సచిన్ పైలట్ డిప్యూటీగా ఉండేవారు. అయితే, బీజేపీతో జట్టుకట్టి కాంగ్రెస్ ను చీల్చే ప్రయత్నాలు చేసిన ఆయన చివరకు రాహుల్ గాంధీ జోక్యంతో వెనక్కుతగ్గారు. కానీ, గెహ్లోత్ తో మాత్రం తాడోపేడో అంటున్నారు. ఇక గెహ్లోత్ 70 ఏళ్లు దాటి రాజకీయ చరమాంకంలో ఉన్నారు. ఆయన ఈసారి కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే సీఎం తానేనని భావిస్తున్నారు. వీరిద్దరికీ భిన్నమైన పరిస్థితి వసుంధరారాజేది. మహారాణిగా పేరున్న ఆమె రాజస్థాన్ సీఎంగా పనిచేశారు. కానీ, ఈసారి మాత్రం వసుంధరను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కన పెడతారనే ఊహాగానాలు వచ్చాయి. ఆమెకు నిన్నటివరకు టికెట్ ఖరారు చేయలేదు. అయితే, శనివారం అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీ కూడా జాబితాలను విడుదల చేసి ఆశ్చర్యపరిచాయి. అధికార కాంగ్రెస్ కు ఇది తొలి జాబితానే. బీజేపీ మాత్రం 83 మందితో రెండో జాబితా ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటివరకు 124 మందికి టికెట్లు ఇచ్చినట్లయింది.

ఆమె అక్కడినుంచే..

వసుంధరా రాజే.. తనకు పెట్టని కోట అయిన ఝల్రాపటన్‌ నుంచే ఆమెను బరిలో దిగనున్నారు. ఇక్కడినుంచి ఆమె 4 సార్లు విజయం సాధించారు. విశేషం ఏమంటే.. చరిత్రలో నిలిచిన మేవాఢ్‌ వీరుడు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ వారసుడు విశ్వరాజ్‌ సింగ్‌ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి బీజేపీ పోటీకి నిలిపింది. కాగా, కాంగ్రెస్ కేవలం 33 మందితో తొలి జాబితాను వెల్లడించింది. గెహ్లోత్‌ సర్దార్‌పురా నుంచి, సచిన్‌ పైలట్‌ టోంక్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ ఇంకా 167 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, ఆదివారం వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత ఇంకొందరు అభ్యర్థులను ప్రకటిస్తారని భావిస్తున్నారు. రాజస్థాన్ లో నవంబరు 25న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటే డిసెంబరు 3న ఫలితాలను వెల్లడవుతాయి.

Tags:    
  • Rajasthan 
  • Assemblyelections 
  • Congress 
  • Bjp 
  • Elections 
  • Candidates 
  • List 
  • Ashokgehlot 
  • Sachinpilot 
  • Vasundhararaje 
  • Ticket 
  • Narendramodi 
  • Amitshah 
  • Rahulgandhi 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS