కూటమి అధికారంలోకి వస్తే రివేంజ్ తప్పదా... రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణంరాజు.

Update: 2024-04-24 04:01 GMT

ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు, ఎన్నో వార్తలు, మరెన్నో ఊహాగాణాల నడుమ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు.. మరోసారి ఆ టిక్కెట్ దక్కని సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనను ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అకామిడేట్ చేశారు చంద్రబాబు. ఆ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణంరాజు.

అవును... తాను కోరుకున్నట్లు నరసాపురం టిక్కెట్ దక్కకపోయినా.. ప్రజలు కోరుకున్నట్లు ఉండి టిక్కెట్ దొరికిందన్నట్లుగా మాట్లాడుతూ, దాన్ని పురోగమనంగా అభివర్ణిస్తున్న రఘురామ.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా కూటమి వరస్ట్ కేస్ లో నూటపాతిక సీట్ల వరకూ దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు! ఇదే సమయంలో... టీడీపీ ప్రత్యేకంగా తనకున్న 144 స్థానాల్లో 90 చోట్ల గెలుస్తుందని చెప్పడం గమనార్హం.

ఇదే క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను చావు అంచుల వరకూ వెళ్లి వచ్చినట్లు చెబుతున్న రఘురామ... కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పర్సనల్ రివేంజ్ లు ఉండవని చెప్పారు. కాకపోతే ఆ అధికారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇక సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావడం అనేది ఊహాజనితానికి మించిన విషయం అని వెల్లడించారు!

ఇదే సమయంలో... రేపటి రోజున గతంలో జగన్ తో జరిగినట్లే, చంద్రబాబుతోనూ జరిగి, విభేదాలు వస్తే.. అప్పుడు బాబుకు కూడా రచ్చబండ తప్పదా అనే విషయంపైనా రఘురామ స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా... చంద్రబాబుపై అలాంటి కార్యక్రమాలేవీ ఉండవని, అసలు రావని చెబుతూ.. ఆయన తనకంటే వయసులో పెద్దవారని.. జగన్ చిన్న పిల్లాడని చెప్పారు!

Read more!

ఇక ఈ సందర్భంగా... తనకు నరసాపురం టిక్కెట్ రాకపోవడం విషయంలో విలన్ జగన్ అని చెబుతున్న రఘురామ... తనను తడిగుడ్డతో గొంతు కోసిన బ్యాచ్ బీజేపీలో ఎవరూ లేరని చెప్పడం గమనార్హం. దీమంతో... బీజేపీలో ఎవరూ సహకరించకపోతే.. ఆ పార్టీ నుంచి నరసాపురం టిక్కెట్ ఎలా పోతుందనే విషయం మాత్రం అస్పష్టంగా ఉంచేశారు.

ఇదే క్రమంలో... సినిమాల్లో ఉండే హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే నాలుగు పాత్రల్లో తనది హీరో పాత్ర అని చెప్పుకున్న రఘురామ... విలన్ పాత్ర కచ్చితంగా జగన్ దే అని, కమెడియన్ పాత్ర విజయ సాయిరెడ్డిదని అన్నారు. ఇక చంద్రబాబు పాత్ర నిర్మాత కాదని చెప్పిన రఘురామ... మాయాబజార్ సినిమాలో హీరో ఏఎన్నార్ అయినా.. సినిమా మొత్తం నడిపించే ఎస్వీ రంగారావు పాత్ర చంద్రబాబుదని వివరించారు!

Tags:    

Similar News