హైదరాబాద్ కు, ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ!

ఈ క్రమంలో ఇది పెట్టుబడి పరిమితులను నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగా... సాధారణంగా వ్యక్తికి 5%, కంపెనీకి 10% అన్ని లావాదేవీల నియంత్రణ నియమాలను పాటిస్తున్నాయని నిర్ధారిస్తుంది.;

Update: 2026-02-01 08:35 GMT

2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను నేడు (ఫిబ్రవరి 1 - 2026) కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను లోక్ సభకు సమర్పించారు. ఈ సందర్భంగా రికార్డ్ స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మాలా సీతారామన్.. తన ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు ఎన్నారైలకు పలు శుభవార్తలు చెప్పారు.

అవును... తాజా బడ్జెట్ లో ఎన్నారైలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా.. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఇప్పుడు పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ (పీ.ఐ.ఎస్) ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు. ఈ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్.. ప్రవాస భారతీయులు, విదేశీ పెట్టుబడిదారులు ఆర్బీఐ ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ద్వారా భారతీయ స్టాక్ లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది!

ఈ క్రమంలో ఇది పెట్టుబడి పరిమితులను నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగా... సాధారణంగా వ్యక్తికి 5%, కంపెనీకి 10% అన్ని లావాదేవీల నియంత్రణ నియమాలను పాటిస్తున్నాయని నిర్ధారిస్తుంది. కాగా... కరెన్సీ బలహీనత, పన్ను అనంతర రాబడి తగ్గడంతో పాటు.. విదేశాల్లో సురక్షితమైన రాబడి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు 2025లో రూ.19 బిలియన్లు ఉపసంహరించుకున్నారని ఘణాంకాలు చెబుతున్నాయి! ఈ నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.

ఈ తాజా నిర్ణయం ప్రకారం... భారతదేశం వెలుపల నివసించే వ్యక్తుల (పీ.ఆర్.ఓ.ఐ)వ్యక్తిగత పెట్టుబడి పరిమితిని 5 నుంచి 10శాతానికి పెంచాలని.. అన్ని వ్యక్తిగత పీ.ఆర్.ఓ.ఐ.లకు మొత్తం పెట్టుబడి పరిమితి ప్రస్తుతం ఉన్న 10% నుంచి 24%కి పెంచాలని ప్రతిపాదించబడింది. దీంతో.. ఈ సంస్కరణ.. అటు పెట్టుబడిదారులకు, ఇటు కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ కు 'హైస్పీడ్' గుడ్ న్యూస్!:

ఇదే సమయంలో ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించిన కీలక ప్రకటన వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. ఇందులో భాగంగా... పూణె - హైదరాబాద్.. హైదరాబాద్ - బెంగలూరు.. హైదరాబాద్ - చెన్నై తో పాటు ముంబై - పూణె.. ఢిల్లీ - వారణాసి.. వారణాసి - సిలిగుడి.. చెన్నై - బెంగళూరు మధ్య కారిడార్లను ప్రకటించారు. ఇదే సమయంలో.. మౌలిక సదుపాయాల కల్పనకు గత ఏడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్ లో రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News