ర‌ఘురామది 'జోస్యమా'.. 'వాస్త‌వ‌మా?'

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ గురించి చేసిన వ్యాఖ్య‌లు కొత్తవి కాక‌పోయినా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం చర్చ‌కు దారి తీశాయి.;

Update: 2025-09-06 18:30 GMT

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ గురించి చేసిన వ్యాఖ్య‌లు కొత్తవి కాక‌పోయినా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం చర్చ‌కు దారి తీశాయి. ఈనెల 18 నుంచి అసెంబ్లీ స‌మావే శాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు రావాల‌ని ప్ర‌తిప‌క్ష‌(ప్ర‌ధాన కాదు) నేత జ‌గ‌న్‌కు స‌భ నుంచి ఆహ్వానం వెళ్లింది. ఇది సాధార‌ణంగా స‌భ‌లో ఉన్న వారికి అంద‌రికీ పంపించే ఫార్మాలిటీనే. ఈ సారి అయినా.. స‌భ‌కు రావాలంటూ.. జ‌గ‌న్‌కు ఆహ్వానం పంపించారు.

ఇక‌, మీడియాలోనూ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు జ‌గ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీనికి అనుబంధంగా ర‌ఘురామ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌భకు రాక‌పోతే.. జ‌గ‌న్‌కు శాస‌న స‌భ స‌భ్య‌త్వం పోతుంద‌ని.. పులివెందుల‌కు ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. అయితే.. వాస్త‌వానికి ఇదే జ‌రిగితే.. అంటే 60 రోజుల పాటు స‌భ‌కు రాక‌పోతే స‌భ్య‌త్వం కోల్పోయే అవ‌కాశ‌మే ఉంటే.. ఒక్క జ‌గ‌న్‌కే కాదు.. ఈ ప‌రిస్థితి ఆయ‌న పార్టీకి చెందిన మ‌రో 10 మందికి కూడా ఎదుర‌వుతుంది. ఎందుకంటే.. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది స‌భ‌కు రావ‌డం లేదు.

అంతేకాదు.. టీడీపీ నుంచి కూడా ఇద్ద‌రు కీల‌క ఎమ్మెల్యేలు.. స‌భ‌కు హాజ‌రు కావ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. స‌త్తెన‌ప‌ల్లి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌భ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హాజ‌రు కాలేదు. తొలి రోజు ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన క‌న్నా.. త‌న‌కు మంత్రి పీఠం ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న‌తో స‌భ‌కు రాకుండా మౌన దీక్ష చేస్తున్నారు. దీనిని సీఎం చంద్ర‌బాబు కూడా లైట్ తీసుకున్నారు. ఇక‌, హిందూపురం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న బాల‌య్య ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.

వ‌రుస సినిమాల‌తో బాల‌య్య బిజీ కావ‌డంతో స‌భ‌కు రాకుండా.. ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ చెప్పిన‌ట్టు వైసీపీపై చ‌ర్య‌లు తీసుకుంటే.. వీరిద్ద‌రిపైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వు. పైగా.. ర‌ఘురామ చెప్పిన‌ట్టు 60 రోజులు స‌భ‌కు రాక‌పోతే ఆటోమేటిక్‌గా స‌స్పెండ్ అవుతార‌న్న‌ది ఏ నిబంధ‌న‌లో ఉందో ఆయ‌న చెప్ప‌లే దు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌జాప్ర‌తినిధ్యం చ‌ట్టంలో ఈ నిబంధ‌న లేదు. అదేవిధంగా చ‌ట్ట స‌భ స‌భ్యుల వేత‌నాలు, చెల్లింపుల‌కు సంబంధించిన చ‌ట్టంలోనూ ఈ నిబంధ‌న చేర్చ‌లేదు. సో.. దీనిని బ‌ట్టి.. ర‌ఘురా మ‌చేసిన వ్యాఖ్య‌లు కేవ‌లం రాజ‌కీయ ప‌ర‌మైన‌వే త‌ప్ప‌.. వాస్త‌వంకాద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతు న్నారు.

Tags:    

Similar News