రాహుల్ రాజీనామా చేస్తే.. ర‌ఘునంద‌న్‌రావు షాకింగ్ కామెంట్స్

వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం లేని వ్య‌క్తులు పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని.. బీజేపీ ఎంపీ, తెలంగాణ నాయ‌కుడు ర‌ఘునంద‌న్‌రావు వ్యాఖ్యానించారు.;

Update: 2025-08-15 05:46 GMT

వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం లేని వ్య‌క్తులు పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని.. బీజేపీ ఎంపీ, తెలంగాణ నాయ‌కుడు ర‌ఘునంద‌న్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి కీల‌క విమ‌ర్శ‌లు చేశారు. పార్ల‌మెంటులో విప‌క్షానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాహుల్‌కు.. ప్ర‌ధాని మోడీఅంటే లెక్క‌లేద‌ని, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌పైన‌, ప్ర‌జాస్వామ్యం పై కూడా సందేహాలేన‌ని అన్నారు. ఇలాంటి వారు.. దేశ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కోసం కాకుండా.. రాజ‌కీయాల కోసం.. త‌మ పార్టీ ఉనికి కోసం పోరాటం చేస్తున్నార‌ని అన్నారు.

ఎన్నిక‌ల సంఘంపై న‌మ్మ‌కం పోయింద‌ని, ఓట్ల చోరీ జ‌రిగింద‌ని ఆరోపిస్తున్న రాహుల్‌గాంధీ.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ్‌బ‌రేలీ(యూపీ) నియోజ‌క‌వ‌ర్గంలో రాజీనామా చేయాల‌ని .. అక్క‌డ బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వ‌హించేలా తామే మాట్లాడ‌తామ‌ని చెప్పారు. ఇలాంటి వ్య‌క్తులు దేశానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంద‌న్న ర‌ఘునంద‌న్‌రావు.. ఇక్క‌డ కూడా.. ఈవీఎంల ద్వారానే వారు అధికారంలోకి వ‌చ్చార‌ని అనుకోవాలా? అని ప్ర‌శ్నించారు.

``తాము గెలిస్తే.. ఈవీఎంలు మంచివి. తాము ఓడిపోయిన‌.. ఓడిపోతామ‌ని భావిస్తున్న రాష్ట్రాల్లో మాత్రం బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. ఇదీ.. ఆయ‌న చెబుతున్న నీతి.`` అంటూ ర‌ఘునం ద‌న్ రావు విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ గ‌తాన్ని త‌వ్విపోశారు. ఈవీఎంలను తెచ్చిందే రాజీవ్‌గాంధీ అని వ్యాఖ్యానించారు. దేశంలో టెక్నాల‌జీ పేరుతో రాజీవ్‌గాంధీ ఈవీఎంల‌ను ప్రోత్స‌హించార‌ని అన్నారు. 2004, 2009లో కూడా ఈవీఎంల‌తో నే ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని.. అప్పుడు కాంగ్రెస్ పార్టీనే విజ‌యం ద‌క్కించుకుంది క‌దా! అని అన్నారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను, రాజ్యాంగాన్ని కూడా విమ‌ర్శిస్తున్న రాహుల్‌గాంధీ.. క‌నీసం వాటిపై అవ‌గాహ‌న ఉండి మాట్లా డుతున్నారా? అని ప్ర‌శ్నించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే కేసీఆర్ ఎట్లా ఓడిపోతారని ప్ర‌శ్నించారు. కేటీఆర్‌కు వ‌డ దెబ్బ త‌గిలింద‌ని.. అందుకే ఆయ‌న తిక్క తిక్క‌గా ఏదేదో మాట్లాడుతున్నార‌ని ర‌ఘు నంద‌న్‌రావు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News