ట్రంప్ కు భారీ బహుమతి ఇచ్చిన ఖతార్ పాలకులు

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఖతార్ పాలకులు ఇస్తున్న ఖరీదైన బహుమతి హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-05-12 05:11 GMT

దేశ అధ్యక్షులకు ఖరీదైన బహుమతులు రావటం మామూలే. కొందరు వాటిని తమతో ఉంచుకుంటే.. మరికొందరు వాటిని ప్రభుత్వానికి ఇచ్చేస్తుంటారు. భారత ప్రధానమంత్రి మోడీ లాంటోళ్లు అయితే.. రెండు మూడేళ్లకు ఒకసారి తనకు వచ్చిన బహుమతుల్లో కొన్నింటిని వేలం వేసి.. ఆ మొత్తాన్ని ఏదో ఒక సంక్షేమ కార్యక్రమానికి వినియోగిస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఖతార్ పాలకులు ఇస్తున్న ఖరీదైన బహుమతి హాట్ టాపిక్ గా మారింది.

అమెరికాకు అధ్యక్షులుగా వ్యవహరించిన మరే అధ్యక్షుడికి ఇంతటి ఖరీదైన బహుమతి రాలేదని చెబుతున్నారు. ఇంతకూ ట్రంప్ నకు ఖతార్ పాలకులు ఇస్తున్న ఖరీదైన బహుమతి మరేమిటో కాదు.. అత్యంత విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానం. వారు ఆఫర్ చేసిన బహుమతిని తీసుకోవటానికి ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే.. అమెరికా చరిత్రలో ఇంతటి ఖరీదైన బహుమతిని గతంలో మరే అధ్యక్షుడు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఖతార్ పాలకులు ఇవ్వనున్న జంబో జెట్ విమానానికి ఎయిర్ ఫోర్స్ వన్ (అమెరికా అధ్యక్షుడి అధికారిక ప్రయాణ విమానం) కు తగ్గట్లు కొన్ని హంగుల్ని చేరుస్తున్నారు. అయితే.. ఈ ఖరీదైన విమానాన్ని 2029 జనవరిలో పదవీ విరమణ చేసే వరకూ ట్రంప్ వినియోగిస్తారని చెబుతున్నారు. ట్రంప్ ఖతార్ పర్యటన సందర్భంగా ఈ కానుకను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఈ సంచలన వార్త మీద ఖతార్ పాలకులు ఇప్పటివరకు స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News