పురంధేశ్వరికి కేంద్ర మంత్రి బెర్త్ ?
దేశంలో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీకి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తి అవుతూనే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ ఎత్తున మంత్రి వర్గ విస్తరణ చేపడుతుంది అని అంటున్నారు.;
రాజకీయంగా రెండున్నర దశాబ్దాల అనుభవం కలిగిన వారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 2004, 2009లలో రెండు సార్లు ఎంపీగా కాంగ్రెస్ తరఫున నెగ్గారు, ఆ సమయంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. ఇక 2014 నాటికి బీజేపీలో చేరారు. ఆమె బీజేపీలో 2024లో రాజమండ్రి నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. అయితే కేంద్ర మంత్రి అవుతారని అంతా అనుకున్నా సామాజిక రాజకీయ స్థానిక సమీకరణల వల్ల వీలు పడలేదు, అయితే ఇపుడు ఆమెకు ఆ లక్కీ చాన్స్ దక్కబోతోంది అని అంటున్నారు.
సీరియస్ గానే :
దేశంలో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీకి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తి అవుతూనే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి భారీ ఎత్తున మంత్రి వర్గ విస్తరణ చేపడుతుంది అని అంటున్నారు.ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో అవసరాల మేరకు కొత్త వారిని తీసుకోవాల్సి రావచ్చు అంటున్నారు. అలాగే బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్ వంటి వారికి కేబినెట్ లో చోటివ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ మొత్తం కసరత్తులో ఏపీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
చిన్నమ్మపై ఫోకస్ :
బీజేపీలో చేరి పుష్కర కాలంగా దగ్గుబాటి పురంధేశ్వరి పనిచేస్తున్నారు. ఆమె పార్టీలో వివిధ హోదాలలో పంచేశారు. ఆమె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండగానే టీడీపీతో పొత్తు కుదిరింది. ఆ పొత్తు వల్ల రాజకీయ లాభం ఈ రోజు కేంద్రంలోని బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చి అనుభవిస్తోంది అని అంటున్నారు. దాంతో పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కాషాయం పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు కేబినెట్ బెర్త్ కి సామాజిక ప్రాంతీయ సమీకరణలు అడ్డు రావు అని అంటున్నారు. బీజేపీలో ఆమెకు ఉన్న సీనియారిటీ నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని కేంద్రంలో తీసుకుంటారు అని అంటున్నారు. ఆమెకి కేబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి ఖాయమని కూడా అంటున్నారు.
ఎక్కువగానే ఆశలు :
ఇక కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు పలువురు ఆశగా ఎదురు చూస్తున్నారు. అందులో టీడీపీ నుంచి కూడా ఉన్నారని అంటున్నారు. మరో మంత్రి పదవి టీడీపీకి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇపుడు ముగ్గురు కేంద్ర మంత్రులు ఉంటే అందులో కేబినెట్ ర్యాంక్ తో రామ్మోహన్ నాయుడు కొనసాగుతున్నారు. సహాయ మంత్రులుగా టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులు ఏపీకి వస్తాయని అందులో టీడీపీ లేదా జనసేనకు ఒకటి, బీజేపీకి మరొకటి దక్కుతుందని అంటున్నారు. అలా బీజేపీ కోటాలో పురంధేశ్వరికి బెర్త్ కన్ ఫర్మ్ అయినట్లే అని ఢిల్లీ వర్గాల భోగట్టాగా ఉంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.