హైదరాబాద్ మాదాపూర్ హాస్పిటల్ అరుదైన ఘనత
ప్రైవేట్ హాస్పిటళ్లు అనగానే ముందుగా కళ్ల ముందు మెదిలేది అక్కడి డాక్టర్లు వసూలు చేసే వేలాది, లక్షలాది రూపాయల బిల్లలు.;
ప్రైవేట్ హాస్పిటళ్లు అనగానే ముందుగా కళ్ల ముందు మెదిలేది అక్కడి డాక్టర్లు వసూలు చేసే వేలాది, లక్షలాది రూపాయల బిల్లలు. చిన్న జ్వరమో లేక మరేదైనా అనారోగ్య కారణంలో హాస్పిటల్ వెళితే డాక్టర్లు రాసే టెస్టులు, మందులకు భయపడిపోతున్నారు ప్రజలు. అలాంటి ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు వెళితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇక సామాన్యులైతే అటు వైపు వెళ్లడానికైతే కనీసం సాహసించరు. అందులో హైదరాబాద్ లాంటి మహానగరంలోని కార్పొరేట్ హాస్పిటల్ అయితే అటు వైపు కన్నెత్తి కూడా చూడు. అలాంటి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓ అరుదైన చికిత్స విజయవంతంగా పూర్తి చేసి ఓఔరా అనిపించుకుంది. ఓ చిన్నారి ప్రాణం నిలబెట్టడంతో పాటు ఆ తల్లిదండ్రులను మనసు గెలుచుకుంది. ఆ వైద్యుల కృషిని ఆనంద బాష్పాలతో కృతజతలు చెప్పింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక ఆస్పత్రిలో అకాలంగా పుట్టిన శిశువు వైద్యుల అద్భుత కృషితో బతికి బయటపడింది. సోమాలియాకు చెందిన ఒక మహిళకు ఏప్రిల్ 18న కేవలం 23 వారాల గర్భదాలికలోనే ప్రసవం జరిగింది. ఆ సమయంలో పుట్టిన ఆడబిడ్డ బరువు కేవలం 565 గ్రాములే.
ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు 115 రోజుల పాటు శిశువును ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించారు. ప్రతి క్షణం ఆ శిశువు ప్రాణం కోసం పోరాటమే సాగింది. ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, శరీరం బలహీనంగా ఉండటం వంటి సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వైద్య బృందం ప్రత్యేక వైద్యసేవలు అందించింది.
ఈ క్రమంలో శిశువు క్రమంగా బరువు పెరిగి, ఆరోగ్యం మెరుగుపడింది. మొదట 565 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డ 115 రోజుల చికిత్స అనంతరం 2 కిలోలకు చేరుకుంది. చివరకు ఆగస్టు 11న వైద్యులు శిశువును తల్లిదండ్రుల ఒడిలోకి అప్పగించారు. ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవ్వడంతో తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు.
అకాల ప్రసవం జరిగే శిశువులకు ఇలాంటి వైద్య సేవలు అందించడం అంత తేలికైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక సదుపాయాలు, వైద్యుల పట్టుదలతోనే ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.
ఈ సంఘటన అకాలంగా పుట్టే శిశువులను కాపాడటంలో హైదరాబాద్ వైద్యవర్గం సాధించిన మరో అరుదైన విజయంగా నిలిచింది.