ఫోన్‌ లో 2,000కు పైగా వీడియోలు... కోర్టులో బిగ్గరగా ఏడ్చేసిన మాజీ ఎంపీ!

గత ఏడాది కర్ణాటక రాజకీయాల్లో మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2025-08-02 09:58 GMT

గత ఏడాది కర్ణాటక రాజకీయాల్లో మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ దోషిగా తేలిన సంగతీ తెలిసిందే. ఈ సమయంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నాడు.. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు.

అవును... అత్యాచారం మరియు లైంగిక వేధింపుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో మాజీ పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులో విలపించారు. తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకుంటూ బిగ్గరగా ఏడ్చాడు.. తీర్పు ప్రకటించిన వెంటనే కన్నీరు మున్నీరుగా విలపించాడు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరమూ వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసు విచారణ ప్రారంభమైన అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది బిఎన్ జగదీష్ కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా... ఇది హై ప్రొఫైల్ కేసు అని.. నిందితుడు సాధారణ వ్యక్తి కాదని.. అతడు నాయకుడు కాబట్టి సమాజానికి ఒక పాఠంగా మారే విధంగా శిక్ష ఉండాలని.. ఈ క్రమంలో ప్రజ్వల్‌ కు జీవిత ఖైదు విధించాలని న్యాయవాది డిమాండ్ చేశారు. మరోవైపు తనకు తక్కువ శిక్ష విధించాలని రేవణ్ణ కోర్టును కోరాడు!

కాగా... కేఆర్‌ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్‌ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా... గన్నిగడ ఫాంహౌస్‌ లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు (47) తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్‌ పై నమోదయ్యాయి. ఈ క్రమంలో 14 నెలలుగా ప్రజ్వల్‌ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

వాస్తవానికి గత లోక్‌ సభ ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇతడి అత్యాచార ఘటనల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో.. ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ప్రజ్వల్‌ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే.. కుటుంబసభ్యుల హెచ్చరికతో చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అతడి ఫోన్‌ లో 2,000కు పైగా వీడియోలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News