నెల్లూరుపై టీడీపీ గురి.. 'మేయర్ పీఠం' ఖాయం!
నెల్లూరు నగర పాలక సంస్థపై టీడీపీ నేతృత్వంలోని కూటమి నాయకులు జెండా ఎగరేయాలని భావిస్తున్నారు.;
నెల్లూరు నగర పాలక సంస్థపై టీడీపీ నేతృత్వంలోని కూటమి నాయకులు జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఇక్కడి పాలక పక్షంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ సమీకరణలు కూడా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ నాయకులు దక్కించుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉండడం కూడా వారికి కలిసివచ్చింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు.. ఇక్కడ వైసీ పీని బలోపేతం చేశారు. అయితే.. గత ఏడాది రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పైగా.. వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు టీడీపీకండువా కప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా కూడా మార్పుకోరుకుంటున్నవారు ఉన్నారు. దీనికితోడు మేయర్ స్రవంతి కుటుంబ రాజకీయాలు కూడా స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారని.. ఈ విషయంలో స్రవంతి భర్త ప్రమేయం ఉందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు.
ఈ క్రమంలోఆయనపై కేసుపెట్టిన పోలీసులు ఫోర్జరీ సంతకాల ఆధారంగా కార్పొరేషన్ సొమ్ములు పక్కదారి పట్టించారని గుర్తించా రు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయినప్పటికీ.. స్రవంతిలో మార్పు రాలేద ని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఉన్నకార్పొరేట్లలో 12 మంది టీడీపీ చెంతకు చేరిపో యారు. వీరిలో కోటంరెడ్డి అనుచరులు, అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు కూడా ఉన్నారు. దీంతో ఇక్కడ మార్పు తప్పద న్న సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలావుంటే.. నెల్లూరు కార్పొరేషన్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం తాజాగా ఏం జరుగు తోందో తెలుసుకోవాలిన.. సరైన నిర్ణయం తీసుకుందామని పేర్కొంది. దీంతో ఇదే జిల్లాకు చెందిన మంత్రి నారాయణ పార్టీ నాయ కులు, కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. మెజారిటీ నాయకుల అభిప్రాయం తెలుసుకున్నారు. ఎక్కువ మంది ఇక్కడ నాయక త్వాన్ని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. అనిల్ వర్గంగా ఉన్న కొందరు కూడా త్వరలోనే టీడీపీ చెంతకు చేరే అవకాశం ఉందన్నారు. దీంతో నెల్లూరు మేయర్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.