సైకిల్ మిస్.. కమలం గూటికి పోతుల!
ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు, ఫైర్ బ్రాండ్ నేత పోతుల సునీత.. బీజేపీలో చేరారు.;
ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు, ఫైర్ బ్రాండ్ నేత పోతుల సునీత.. బీజేపీలో చేరారు. వాస్తవానికి ఆమె టీడీపీలో చేరాలని భావించారు. కానీ, అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ఆమెకు చోటు దక్కలేదు. గతంలో సీఎం చంద్రబాబును విమర్శించడం.. నారా లోకేష్‌ను వైసీపీ నాయకు లతో కలిసి దూషించడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేర్చుకునేందుకు సీనియర్లు విముఖ త వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనేనని.. చంద్రబాబు భావించారు.
దీంతో పోతుల సునీతను చేర్చుకోవాలని భావించారు. కానీ, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. మాత్రం ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దాదాపు ఎనిమిది మాసాలుగా పోతుల సునీత త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు.. పోతుల సునీత వైసీపీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు.. అప్పటి సీఎం జగన్.. ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయితే.. పార్టీ అధికారం కోల్పోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన పోతుల.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయించారు. కానీ, ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందక పోవ డం.. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే విషయం డోలాయమానం పడడంతో పోతుల సైలెంట్ అయ్యారు. అయితే.. తాజాగా ఆమెకు బీజేపీ ఆహ్వానం పలికింది. విశాఖపట్నానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. జేపీ నడ్డా ఆధ్వర్యంలో పోతుల సునీతకు పార్టీ కండువా కప్పారు. పార్టీ అభివృద్ధికి పాటు పడాలని.. ఈ సందర్భంగా నడ్డా ఆమెకు సూచించారు. ఇదిలావుంటే.. కాపు సామాజిక వర్గంలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఉన్న పోతుల సునీతకు.. రాజకీయ వైరం ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఆమె ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య రాజకీయాల కోసం పోరాడారన్న వాదన ఉంది. గతంలో చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. ఆమె టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలోనే జగన్ చెంత కు చేరారు. ఇక్కడ కూడా ఆధిపత్య రాజకీయాలు సాగించారు. ఈ పరిణామాలతోనే పార్టీలో ఏకాకి అయ్యార న్న చర్చ సాగింది. ఇక, ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీలోకి పోతుల సునీత అడుగు పెట్టడం గమనా ర్హం.