• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బన్నీ అంటే ఒక బ్రాండ్......

బన్నీ అంటే ఒక బ్రాండ్... పవన్ కు పోతిన మహేష్ సంచలన ప్రశ్నలు!

| జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై వైసీపీ నేత పోతిన మహేష్ గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-04-21 09:10 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై వైసీపీ నేత పోతిన మహేష్ గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా పార్టీ పెట్టిన పదేళ్లలో ఆయన ఆస్తులు ఏ స్థాయిలో పేరిగాయో చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా! ఈ సమయంలో తాజాగా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అల్లూ అర్జున్, దిల్ రాజుల పేర్లు ప్రస్థావించడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!

అవును... తనకు టిక్కెట్ దక్కకపోవడంపై తీవ్ర నిరసన తెలిపిన పోతిన మహేష్.. ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాన్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... "ప్రభాస్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతారు.. మహేష్ బాబు, చరణ్ ల గురించి చెబుతారు.. కానీ, మీ కుటుంబలోని ఒక వ్యక్తి అయిన అల్లు అర్జున్ గురించి ఏనాడైనా నాలుగు మాటలు పొగిడారా పవన్ కల్యాణ్ గారూ" అంటూ మొదలుపెట్టారు మహేష్!

ఈ సందర్భంగా.. "ఇండస్ట్రీలో తామే బ్రాండ్ బ్రాండ్ అంటారు కదా.. మరి ఏనాడైనా అల్లూ అర్జున్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా? అల్లూ అర్జున్ ఒక బ్రాండ్.. తెలుసుగా ఆ బ్రాండ్ పేరు.. “డబుల్ ఏ”! ఆయన తన దగ్గర గొడుగు పట్టుకున్న చాలా మందిని ప్రొడ్యూసర్లుగా చేశాడు.. డైరెక్టర్లుగా చేశాడు.. చాలా మందికి సొంత ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు.. బందువులకు, స్నేహితులకు, తనను నమ్ముకున్నవారికి సొంత ఇల్లు కొనిచ్చారు.. ఆయన ఒక బ్రాండ్" అని తెలిపారు.

"ఒక చిరిగిపోయిన చొక్కా వేసుకుని, చిరిగిన లుంగీ కట్టుకుని, ఒక ఇరిగిపోయిన పుల్లపట్టుకుని.. ఇంటిముందు ముగ్గులో వేసే నాలుగు రంగులు ముఖానికి రాసుకుని వెయ్యి కోట్లు వసూళ్ల్ చేసిన ఆయన బ్రాండ్ పుష్ప.. దేశవ్యాపతంగా కదిలించింది ఆ సినిమా.. అది బ్రాండ్ అంటే.. అది ఇండస్ట్రీని బ్రతికించడం అంటే" అని కంటిన్యూ చేసిన పోతిన మహేష్... "మీరు ఎక్కడైనా అటువంటివి చేశారా.." అని పవన్ కల్యాణ్ ని ప్రశ్నించారు!

ఇదే సమయంలో... ఈ మధ్య చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కల్యాణ్ స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడారు. అసలు నీకు స్కిల్లే లేదు.. ఇంక డెవలప్ మెంట్ ఎక్కడుంటుంది. అందుకే అల్లూ అర్జున్ బ్రాండ్ గురించి మాట్లాడాను. పుష్పా-2 టెబుల్ 1200 కోట్లు అని అంటున్నారు.. ఈ లెక్కన ఇండస్ట్రీ ఎవరిమీద బ్రతుకుతుంది.. ఎవరు ఉపయోగపడుతున్నారు.. అసలు మీ దగ్గర పెరిగిన వాళ్ల పేర్లు చెప్పండి.. మరి మీరు బ్రాండ్ అని చెబుతారు?" అని ప్రశ్నించారు.

అనంతరం... హరిహర వీరమల్లు సినిమా నాలుగు సంవత్సరాల నుంచి తీస్తున్నారు అని చెప్పిన మహేష్... అక్కడ ప్రొడ్యూసర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ ఏఎం రత్నం గురించి చాలా మంది మాట్లాడుతున్నారని తెలిపారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు ఒప్పుకుని పూర్తిచేసినా కూడా హరిహర వీరమల్లు మాత్రం ఎందుకు పూర్తి చేయరు అని పోతిన మహేష్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా... "మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ నుంచి వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలా మందికి కలుగుతుంది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం... "పవన్ కల్యాణ్ మీద దిల్ రాజు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కి కంప్లైట్ ఇచ్చారా లేదా.. అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి..?" అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు.

అదేవిధంగా... "మొత్తం డబ్బులు మీరే ఇన్ కం ట్యాక్స్ కట్టి.. మొత్తం డబ్బులు వైట్ లోనే ఇవ్వాలంటూ దిల్ రాజుని ఇబ్బంది పెడితేనే.. మీ మీద ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఆయన లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినట్లు చెబుతున్నారు.. ఇది నిజమా కాదా?" అని ప్రశ్నించారు! ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర వైరల్ అవుతున్నాయి!

Full View
Tags:    
  • Pothinamahesh 
  • Pawankalyan 
  • Blackmoney 
  • Dilraju 
  • Hariharaveeramallu 
  • Janasena 
  • Alluarjun 
  • Tollywood 
  • Appolitics 

Similar News

డిసెంబరులో కీలక మార్పులు.. రాయలసీమ నుంచి కొత్త మంత్రులు

2026-11-02 13:55 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

'పదకొండు' ముహూర్తం బాగుంది.. వాళ్లు భుజాలు తడుముంటే నేనేం చేయాలి : విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-02 13:50 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

Copyright @2026

Powered by Blink CMS