ఉగాది రోజున వైసీపీలోకి పోతిన మహేష్...!?

జనసేనలో పవన్ కళ్యాణ్ నీడగా ఆయనకు పేరు. అసలు ఆయన వంటి మాస్ లీడర్ ఉంటే చాలు ఏ పార్టీకి అయినా అన్న పేరు తెచ్చుకున్నారు.

Update: 2024-04-08 11:20 GMT

జనసేనలో పవన్ కళ్యాణ్ నీడగా ఆయనకు పేరు. అసలు ఆయన వంటి మాస్ లీడర్ ఉంటే చాలు ఏ పార్టీకి అయినా అన్న పేరు తెచ్చుకున్నారు. గత అయిదేళ్ళలో విజయవాడ వంటి రాజకీయ రాజధానిలో పోతిన మహేష్ పేరు మారుమోగింది. ఆయన బీసీ నేతగా ఉండడం ప్లస్ పాయింట్ అయింది జనసేనకు ఎవరు లీడర్స్ అంటే పవన్ నాదెండ్ల మనోహర్ తరువాత వినిపించే మూడవ పేరు ఆయనదే.

ఇక 2019 ఎన్నికల్లో చూస్తే పోతిన మహేష్ ఏకంగా పాతిక వేల దాకా ఓట్లు సాధించి అంతా తనవైపు చూసేలా చేశారు. బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్న విజయవాడ వెస్ట్ లో ఎన్నో పోరాటాలు చేసి జనసేన జెండాగా మారారు. ఆయనకు కచ్చితంగా సీటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సీటు చివరి నిముషంలో వచ్చిన బిగ్ షాట్ సుజనా చౌదరి తన్నుకుపోయారు.

దాంతో పోతిన మహేష్ కి ఇక పార్టీని వీడడం తప్ప మరో మార్గం లేకపోయింది. అంతా అనుకున్నట్లుగానే ఆయన జనసేన పార్టీని వీడారు. ఆయన ఇపుడు ఏ పార్టీలో చేరుతారు అన్నది ఒక చర్చగా ఉంది. ఆయనకు అధికార పార్టీ వైసీపీ సాదరంగా ఆహ్వానిస్తోంది అని అంటున్నారు.

విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కేశినేని నాని ఈ మేరకు పోతిన మహేష్ తో చర్చకు జరిపినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మహేష్ భావించారు అని అంటున్నారు. అయితే ఆయనతో కేశినేని నాని చర్చలు జరపడంతో నాని ఫ్యాన్ నీడకు చేరుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ పరిణామం విజయవాడ పరిధిలో వైసీపీ బలాన్ని పెంచేదిగా ఉంది అని అంటున్నారు.

Read more!

అదే సమయంలో జనసేనకు ఇది బిగ్ షాక్ గా ఉంటే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుజనా చౌదరికి బిగ్ ట్రబుల్ గా మారుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పోతిన మహేష్ వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అని అంటున్నారు.

ఉగాది వేళ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జగన్ బస్సు యాత్ర సాగుతోంది. అక్కడికే వెళ్ళి మహేష్ వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఉగాది వేళ కనుక ముహూర్తం మారితే మాత్రం జగన్ బస్సు యాత్ర మరో వారం రోజులలో విజయవాడలో అడుగుపెడుతుంది కాబట్టి ఆ సమయంలో అయినా మహేష్ వైసీపీలో చేరడం ఖాయం అంటున్నారు. మొత్తం మీద చూస్తే మహేష్ వైసీపీ వైపుగానే అడుగులు వేంగాగా వేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు టీడీపీ కూటమిని ఎంతలా ఇబ్బందిని గురి చేస్తారో. ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో.

Tags:    

Similar News