నెల్లూరును వైసీపీ వదులుకున్నట్టేనా ..!
గతంలో పార్టీ కోసం పనిచేసిన వారు ఇప్పుడుకనిపించడం లేదు. గత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎ న్నికల్లో నెల్లూరు వైసీపీకి దక్కింది.;
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై టీడీపీ నేతృత్వంలోని నాయకులు పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తున్నారు. అ యితే.. ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ఎక్కడైనా చిన్న తేడా వస్తేనే నాయకులు స్పందిస్తారు. తమ పార్టీ ప్రభావాన్ని తగ్గకుండా చూసుకుంటా రు. అయితే.. వైసీపీలో మాత్రం ఈ తరహా పరిస్థితి కనిపించలేదు.
గతంలో పార్టీ కోసం పనిచేసిన వారు ఇప్పుడుకనిపించడం లేదు. గత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎ న్నికల్లో నెల్లూరు వైసీపీకి దక్కింది. నిజానికి నెల్లూరులో బలమైన టీడీపీ పక్షాన్ని సుప్తచేతనావస్థలో ఉంచి వైసీపీ ఇక్కడ పాగా వేసింది. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్,ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో పడేందుకు దోహదపడ్డారు. అయితే.. ఇప్పుడు ఈ కార్పొరేషన్‌పై సహజంగానే సర్కారులో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల దృష్టి పడింది.
కారణాలు ఏవైనా.. రాజకీయంగా చూసుకుంటే.. నెల్లూరు కార్పొరేషన్‌లో మార్పు కనిపించేందుకు అవకా శం ఏర్పడింది. ఇప్పటి వరకు అనేక స్థానిక సంస్థలలో టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు నెల్లూరు విష యంలోనూ ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో మార్పుదిశగా అడుగు లు పడుతున్నాయి. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటివారు.. తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ప్రస్తుతం మేయర్‌గా ఉన్న స్రవంతి విషయంలో ఆరోపణలు వస్తుండడం కూడా దీనికి మరో కారణంగా కనిపిస్తోంది.
ఇక, వైసీపీ అధిష్టానం పరంగా కూడా.. పెద్దగా ఊపు కనిపించడం లేదు. ఒక స్థానం చెదిరి పోతుంటే.. దాని పై సమీక్ష చేయడం లేదా.. నాయకులను కాపాడుకోవడం వంటి కీలక విషయాలపై దృష్టి పెడతారు. కానీ, ప్రస్తుతం వైసీపీలో నెల్లూరు విషయం పెద్దగా చర్చకు రావడం లేదు. ఏం జరిగితే అదే జరుగుతుంది.. అన్నట్టుగా నాయకులు వ్యవహరించడం గమనార్హం. దీనివల్ల పార్టీకి జరిగే నష్టాన్ని అంచనా వేస్తున్నారో.. లేక దీనివల్ల వచ్చే ఎన్నికల నాటికి ఇదే సింపతీగా మారుతుందని అంచనా వేస్తున్నారో చూడాలి.