కనెక్ట్ విత్ యూత్ : మోడీ భారీ ప్రోగ్రాం !

ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడతారు అని అంటున్నారు. ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వాకాథాన్‌లు, క్రీడా పోటీలు, యోగా, ధ్యాన సదస్సులు, వీధి నాటకాలు నిర్వహించడం జరుగుతుంది.

Update: 2026-08-03 04:12 GMT

ప్రధాని నరేంద్ర మోడీ యూత్ తో కనెక్ట్ అయ్యేందుకు చూస్తున్నారు. ఇటీవల జరిగిన విద్యార్ధి ఉద్యమాల ప్రభావమో మరేమో తెలియదు కానీ నరేంద్ర మోడీ ఇన్ స్టా గ్రామ్ లో వరసగా వీడియోలు చేస్తున్నారు. ఆయన యువతకు ఏమి చెప్పాలనుకున్నా ఇది వరకు బహిరంగ సభలలో వెల్లడించేవారు. కానీ ఇపుడు ప్రత్యేకంగా ఇస్టాలోనే చెబుతున్నారు. అక్కడ అయితేనే డైరెక్ట్ గా వారికి కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు తన మంత్రివర్గ సహచరులకు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువగా పోస్టులు చేయాలని సూచించారని కూడా ప్రచారం సాగింది.

యువత కోసమే అంటూ :

ఇదిలా ఉంటే వికసిత భారత్ సంకల్ప అభియాన్‌లో భాగంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ని ప్రారంభించారు. ఇది మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశమంతటా ఏకంగా వంద వారాల పాటు కొనసాగే ప్రోగ్రాం గా పేర్కొంటున్నారు. అంటే ఏడాదికి 52 వారాలు ఉంటే రెండేళ్ళ వరకూ నిరంతరంగా సాగే భారీ కార్యక్రమం అన్న మాట. ఇది ప్రజా భాగస్వామ్య ఉద్యమంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం అలాగే దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

యువ భాగస్వామ్యంగా :

ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడతారు అని అంటున్నారు. ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వాకాథాన్‌లు, క్రీడా పోటీలు, యోగా, ధ్యాన సదస్సులు, వీధి నాటకాలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యా సంస్థలు యువజన సంఘాలు ఆధ్యాత్మిక సంస్థలు ఇందులో వర్చువల్‌గా పాలుపంచుకుంటాయని చెబుతున్నారు. యువత మంచి మార్గంలో ఉండేలా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ దోహదపడుతుందని అంటున్నారు.

ఆరోగ్య యువత కావాలి :

దేశానికి ఆరోగ్యకరమైన యువత కావాలని మోడీ కోరుకుంటున్నారు. ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా చక్కని ఆరోగ్యంతో ఉండే వారి వల్లనే వికసిత భారతం 2047 కలలు నిజమవుతాయని అంటున్నారు. ఇక యువతను మోడీ ఈ సందర్భంగా దేశానికి అమృత తరం అని ప్రధాని మోడీ అభివర్ణించడం విశేషం. రేపటి భారతం యువతదే అని ఆయన చెప్పుకొచ్చారు. 2047 నాటికి దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే వాటి ఫలాలు అందుకునేది యువతే అని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఇక యువతలో ఉన్న శక్తి సృజనాత్మకత ప్రతిభ దేశానికి ఎంతో అవసరం అని ఆయన అన్నారు. దేశం కోసం యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తం మీద మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత వాటికి దూరంగా ఉండాలని మంచి ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా యువతకు చక్కని సందేశం అందుతుంది అని అంటున్నారు. మోడీ కూడా యువతను ఈ విధంగా ఫోకస్ చేశారు అని చెబుతున్నారు.

Tags:    

Similar News