• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫస్ట్రేషన్.. పీచేముడ్.....

ఫస్ట్రేషన్.. పీచేముడ్.. పిఠాపురం వర్మ యూటర్న్ వెనుక కథేంటి?

| పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ తాజాగా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-02-21 06:30 GMT

పవన్ కళ్యాణ్ కోసం త్యాగశీలిగా మారిన పిఠాపురం టీడీపీ ఇన్ చార్జి వర్మ కక్కలేక మింగలేని పరిస్థితుల్లో ఉన్నారా? నిన్న సీరియస్ గా పవన్ కు వ్యతిరేకంగా పరోక్ష వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అది వైరల్ కావడంతో ఇప్పుడు ‘అబ్బే అది నేను పోస్ట్ చేయలేదంటూ కవర్ చేయడం చూస్తుంటే.. ఆయనలో అంతులేని ఆవేదన ఏమైనా దాగి ఉందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానపడుతున్నారు. పవన్ కోసం సీటు త్యాగం చేయడం.. ఆయన డిప్యూటీ సీఎం కావడం.. తనకు కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కకపోవడంతో ఈనేత చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో ఇలాంటి అసంతృప్తి సెగలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి..

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ తాజాగా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. "కష్టపడి సాధించే విజయానికే గౌరవం" అంటూ పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌లో ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోలో వర్మ స్వయంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన ప్రచార దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. అయితే, ఆసక్తికరంగా ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు.

-జనసేన వర్గాల్లో ఆగ్రహం

వర్మ పెట్టిన ట్యాగ్ లైన్, వీడియో కంటెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ స్వయంగా కష్టపడి గెలవలేదన్న సూచన కనిపిస్తోంది. తానే కష్టపడి పవన్ గెలుపుకు కృషి చేశానన్న భావన అందులో స్పష్టంగా ఉందని జనసేన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్వీట్‌పై జనసేన శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వర్మపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.

-తీవ్ర విమర్శలతో ట్వీట్ తొలగింపు

సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన వర్మ, తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. అంతేకాకుండా, దీనికి తనకెలాంటి సంబంధం లేదంటూ వరుస వివరణలు ఇచ్చారు. ఈ ట్వీట్ తన హైదరాబాద్ సోషల్ మీడియా టీమ్ నుంచి పొరపాటుగా పోస్ట్ అయిందని స్పష్టం చేశారు.

- వర్మ అసంతృప్తి నిజమేనా?

వర్మ వివరణ ఇచ్చినా, రాజకీయ వర్గాల్లో అతని అసంతృప్తి గురించి చర్చ కొనసాగుతోంది. పిఠాపురంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జనసేన నేతల తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ అసంతృప్తి వల్లే ఆ ట్వీట్ బయటికి వచ్చిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

-భవిష్యత్తులో కీలక పరిణామాలు?

ట్వీట్ వివాదం తాలూకూ దుమారం చల్లారినప్పటికీ, వర్మ భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ గెలుపులో తన పాత్రను హైలైట్ చేసేందుకు చేసిన ప్రయత్నం వివాదాస్పదమవడంతో, టీడీపీ-జనసేన మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందా అనే చర్చ జరుగుతోంది. వర్మ పదవి వచ్చేదాకా ఇలా అసమ్మతిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాదు లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది.ఈరోజు నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో కి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని (1/2)

— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025
Tags:    
  • Svsnvarma 
  • Pithapuram 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Janasena 
  • Pawankalyan 
  • APdeputychiefminister 
  • Ndaalliance 
  • Bjp 
  • Ysrcp 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS