• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్‌ లో షర్మిల...

కాంగ్రెస్‌ లో షర్మిల చేరిక.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

| వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-01-04 09:57 GMT

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తన భర్త అనిల్‌ కుమార్‌ తో కలిసి ఢిల్లీ వెళ్లిన షర్మిల అక్కడ కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్‌ మంత్రి, ఆ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఉన్నా.. వైఎస్‌ జగన్‌ కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరినంత మాత్రాన రాజకీయాల్లో మేం పార్టీ మారి మా కాళ్లు మేమే నరుక్కుంటామా? అని ప్రశ్నించారు.

కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే నైజం సోనియాగాంధీది, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. అందుకే ఆనాడు ఇద్దరూ కలిసి జగన్‌ ను జైలుకు పంపించారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కుటుంబాల్ని కాదు మనుషులను చీల్చి రాజకీయాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.

రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాము పద్ధతి ప్రకారం రాజకీయాలు నడిపిన వ్యక్తులమని తెలిపారు. ఆ పద్ధతి ప్రకారమే జగన్‌ తోనే ఉంటామన్నారు. మంచి జరిగినా.. చెడు జరిగినా జగన్‌ వెంట ఉంటామని స్పష్టం చేశారు. జగనే తమ నాయకుడని.. ఆయనతోనే కలిసి పని చేస్తామని తేల్చిచెప్పారు. తిరిగి జగన్‌ అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషి చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు.

పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని పెద్ది రెడ్డి అన్నారు. రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడడం మంచిది కాదని చెప్పారు. ఒక జడ్పీటీసీగా ఓడిపోయిన ఆయన్ని ఎమ్మెల్యేగా చేశామని.. ఇది ఆయన తెలుసుకోవాలని సూచించారు.

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి ఈ మేరకు షర్మిల వ్యవహారంపై స్పందించారు. జగన్‌ పై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని వైసీపీ కోసం çపనిచేయాలని సూచించారు.

కాగా మంత్రి పెద్దిరెడ్డి కామెంట్లను బట్టి షర్మిలపై వైసీపీ స్టాండ్‌ ఇదేనని అంటున్నారు. జగన్‌ అనుమతి లేకుండా ఆయన షర్మిల వ్యవహారంపై మాట్లాడి ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ కు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా తాము వారిని ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పడం ద్వారా వైసీపీ స్టాండ్‌ ను ఆయన ప్రకటించారని అంటున్నారు.

Tags:    
  • Pedireddy 
  • Sharmila 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • Congress 
  • Punganur 
  • Andhrapradesh 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS