రానున్న అయిదేళ్లలో పవన్ సీఎం అవుతారా...లాజిక్ ఇదే !?

ఏపీలో ఇపుడు హోరా హోరీగా పోరు సాగింది. ఎవరికైనా మెజారిటీ భారీగా దక్కదు అని సర్వేలతో పాటు అంచనాలూ ఘోషిస్తున్నాయి.

Update: 2024-05-17 13:14 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం పండే ఎన్నికలుగా 2024 ని అంతా భావిస్తున్నారు. కేవలం పవన్ మాత్రమే కాదు ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం ఆశలను తీర్చే ఎన్నికలుగా కూడా చూస్తున్నారు. ఏపీలో ఇపుడు హోరా హోరీగా పోరు సాగింది. ఎవరికైనా మెజారిటీ భారీగా దక్కదు అని సర్వేలతో పాటు అంచనాలూ ఘోషిస్తున్నాయి.

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ కి ఒకటి రెండు సీట్లు అదనంగా సాధిస్తారు తప్ప అంతకు మించి రావు అని కూడా అంటున్నారు. ఇలా కనుక చూస్తే ఏపీలో టీడీపీ కూటమికి బొటాబొటీ మెజారిటీ వచ్చి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వస్తే మాత్రం ఏపీ రాజకీయాలు పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంటాయని అంటున్నారు.

అదెలా అంటే ఏపీలో రాజకీయాలను బీజేపీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేలా అని అంటున్నారు. టీడీపీ కూటమికి బొటా బొటీ మెజారిటీ అంటే అందులో టీడీపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 88 సీట్లు రానట్లే అని అంటున్నారు. అపుడు అసలైన రాజకీయ చెలగాట స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.

కేంద్రంలో మోడీ పవన్ కళ్యాణ్ ని సీఎం గా చేయమని కూటమి పెద్దలను ఆదేశించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. ఇక్కడ మరో ముచ్చట కూడా జరగబోయే అవకాశం ఉంది అని అంటున్నారు. అదేలా ఉంటే ఏపీలో వైసీపీకి 75, టీడీపీకి 75 సీట్లు వచ్చి జనసేనకు 15 సీట్లు బీజేపెకి నాలుగైదు సీట్లు వస్తే మాత్రం మోడీ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ తప్పకుండా ఇస్తారు అని అంటున్నారు.

Read more!

పవన్ ని సీఎం గా చేయమని ఆయన చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తారని అలా కుదరకపోతే మాత్రం జగన్ తో అయినా ఒప్పించి పవన్ ని సీఎం చేసేలా అటు వైపు నుంచి కూడా వ్యూహరచన చేస్తారు అని అంటున్నారు. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ కి 88 సీట్లు అవసరం పడుతుంది. దానికి కొంచెం దూరంలో టీడీపీ వైసీపీ నిలబడితే మోడీ జగన్ చంద్రబాబులను పిలిచి మాట్లాడి ఒప్పించి అయినా పవన్ కి సీఎం అయ్యే చాన్స్ ఇప్పిస్తారు అని అంటున్నారు.

ఒకవేళ మోడీ చేసే ప్రతిపాదనకు ఈ ఇద్దరు నేతలు ఒప్పుకోకపోతే మాత్రం వారి మీద ఉన్న కేసులతో అయినా భయపెట్టి ఒత్తిడి తెస్తారని ఆ నైపుణ్యం బీజేపీ పెద్దలకు ఉందని అంటున్నారు. ఏపీ వరకూ చూస్తే బీజేపీ తనదైన రాజకీయాలను చేయాలని ఉబలాట పడుతోంది. అందులో పవన్ ని ముందు పెట్టి తన గేమ్ స్టార్ట్ చేసినా చేయవచ్చు అని అంటున్నారు. ఇప్పటి దాకా ఏపీ రాజకీయాలు బీజేపీకి ఒక విధంగా పట్టు చిక్కేలా లేవు.

2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి కడు బలంగా ఉన్నారు. దాంతో ఆయనను కదపలేని పరిస్థితి. 2019లో జగన్ రెట్టింపు బలంతో ఉన్నారు. దాంతో ఏమీ అనలేని పరిస్థితి. ఈసారి ఎవరికీ మెజారిటీలు రాకపోతే కేంద్రం చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. నిజానికి ఇలాంటి విషయాలలో బీజేపీ సిద్ధహస్తురాలు అని కూడా అంటున్నారు.

మహారాష్ట్ర. గతంలో కర్నాటక మధ్యప్రదేశ్ లలో జరిగిన సంఘటనలు ఒక పెద్ద నంబర్ తో ఎమ్మెల్యేలు ఫిరాయించడాలూ అన్నీ చూస్తే బీజేపీ పొలిటికల్ మ్యాజిక్ ఏంటి అన్నది అర్ధం అవుతుంది అని అంటున్నారు. ఏపీలో ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి వస్తే మాత్రం కచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ గా బీజేపీ తీసుకుంటుంది అని అంటున్నారు.

4

ఒకవేళ పార్టీల అధినాయకత్వాల నుంచి వీలు కాకపోతే ఆయా పార్టీలలో ఏక్ నాధ్ షిండేలను కూడా తయారు చేయగల కెపాసిటీ బీజేపీకి ఉందని అంటున్నారు. గతంలో ఒక ఏపీ బీజేపీ నేత అయితే తమకు ఏపీలో ఏక్ నాధ్ షిండేలు చాలా మంది ఉన్నారని చెప్పారు కూడా.

మొత్తం మీద చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం గా చేయాలని చెప్పి బీజేపీ ఏపీ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు చూస్తుందని అంటున్నారు. ఏపీలో వైసీపీకి టీడీపీకి కనుక ఫుల్ మెజారిటీ రాకపోతే బీజేపీ గేమ్ ప్లాన్ ని తట్టుకోవడం బాబు జగన్ లకు కష్టసాధ్యమే అని అంటున్నారు. ఇక పవన్ ఏ విధంగా సీఎం అవుతారు అన్న దాని మీద జనసేన యూత్ వింగ్ లో ఈ విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అంతే కాదు ఏపీలో హంగ్ వస్తే కనుక పవన్ కింగ్ అని వారే ప్రకటిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News