• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సోషల్ మీడియాలో పోస్టు.....

సోషల్ మీడియాలో పోస్టు.. తక్షణం స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

| ఈ నెల 16న ఎక్స్ లో రోడ్డు దుస్థితిపై పోస్టు రాగా, పవన్ ఆదేశాలతో 17న రోడ్డును పరిశీలించిన అధికారులు వెనువెంటనే మరమ్మతులు చేపట్టారు.

By - Tupaki Desk
Update: 2025-09-18 19:30 GMT

అధికారిక విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై తన నిబద్ధతను చాటుకున్నారు. వర్షాలకు అధ్వానంగా మారిన తమ ఊరి రోడ్డును బాగు చేయాలని ఓ వ్యక్తి చేసిన పోస్టును సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం.. తక్షణం రోడ్డు మరమ్మతులపై ద్రుష్టి పెట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రోడ్డు మరమ్మతులకు ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేశారు. 24 గంటల్లోనే రోడ్డు సమస్యను పరిష్కరించిన డిప్యూటీ సీఎంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం - అడ్డతీగల మధ్య రహదారి గుంతలమయంగా తయారైంది. చాలా కాలంగా రిపేర్లకు నోచుకోని ఈ రోడ్డు తాజా వర్షాల వల్ల ప్రయాణించడానికి వీలు లేకుండా తయారైంది. దీంతో చైతన్య రాజు అనే వ్యక్తి రోడ్డు దుస్థితిని తెలియజేసే విధంగా ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. అంతేకాకుండా ఆ పోస్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశాడు. రోడ్డుపై గోతులు ఉన్నాయని, వాహనాల రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థుడు చైతన్యరాజు ఆ పోస్టులో వాపోయాడు. ఈ పోస్టును చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెనువెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పవన్ ఆదేశాలతో కాకినాడ జిల్లా ఆర్ అండ్ బి అధికారులు ఆఘమేఘాలపై స్పందించారు. ఈ నెల 16న ఎక్స్ లో రోడ్డు దుస్థితిపై పోస్టు రాగా, పవన్ ఆదేశాలతో 17న రోడ్డును పరిశీలించిన అధికారులు వెనువెంటనే మరమ్మతులు చేపట్టారు. 24 గంటల్లోనే గుంతలను కప్పి రోడ్డును సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కాగా, 10.541 కిలోమీటర్ల రోడ్డును ఎన్.డి.బి. (New Development Bank of BRICS countries) నిధులతో కొత్తగా నిర్మించాలని సూచించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.

రహదారుల నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గుంతలు లేని రహదారులు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. పల్లె పండుగ పేరుతో గ్రామగ్రామాన రహదారులను నిర్మించారు. అదేవిధంగా గుంతల్లేని రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.800 కోట్లు వెచ్చించారు. కానీ, ఏలేశ్వరం- అడ్డతీగల రహదారి రూపు మారకపోవడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • PawanKalyan 
  • APDeputyCM 
  • AndhraPradeshNews 
  • PublicGovernance 
  • RoadRepair 
  • EleshwaramRoad 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS