ఎస్-400 శేషనాగు.. పాక్ సైన్యం ఎలుకలు.. పవన్ ట్వీట్ పీక్స్!

ఈ సందర్భంగా ఎస్-400 గొప్పతనం గురించి రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాన్ని ఎలుకలతోనూ.. భారతదేశ రక్షణ వ్యవస్థను శేషనాగుతోనూ పోల్చారు పవన్ కల్యాణ్.;

Update: 2025-05-13 09:44 GMT

పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతరం ఉగ్రవాదన్ని పోషిస్తూ, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్ కు, ఆ దేశ దత్తపుత్రులు ఉగ్రవాదులకు భారత్ ఉమ్మడి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 25 నిమిషాల్లో ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేసిన భారత సైన్యం.. మూడు రోజుల్లో పాక్ కు ముచ్చెమట్లు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించేసింది.


దీంతో... కాల్పుల విరమణకోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరిగిన పాక్.. అమెరికాను తెగ బ్రతిమాలేసిందని అంటున్నారు. ఏది ఏమైనా భారత్ ను సీజ్ ఫైర్ కు ఒప్పించాలని ప్రాదేయపడిందని చెబుతారు. దీంతో... పాక్ కోరిక మేరకో, యూఎస్ ఒత్తిడి మేరకో, శాంతి స్థాపన కోసమో తెలియదు కానీ.. భారత్ సీజ్ ఫైర్ కి అంగీకరించింది.

అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే.. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్రవాద వినాశనం అని, అది కొనసాగుతూనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అత్యంత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

అవును... ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా భారత్ పై పాకిస్థాన్ వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే... వాటన్నింటినీ దుర్భేద్యమైన భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది.. పాక్ డ్రోన్లు, క్షిపణులు భారత భూభాగంపై గాయం చేసే అవకాశం ఇవ్వకుండా చూసింది.

ఈ పనిలో ఎస్-400 కీలక భూమిక పోషించింది. ఈ సందర్భంగా ఎస్-400 గొప్పతనం గురించి రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాన్ని ఎలుకలతోనూ.. భారతదేశ రక్షణ వ్యవస్థను శేషనాగుతోనూ పోల్చారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తిరువళ్లువార్ తిరుక్కురల్ లోని ఒక పద్యాన్ని ప్రయోగించారు!

ఈ సందర్భంగా.. తమిళం, హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దాన్ని అనువదించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తమిళ కవి తిరువళ్ళువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. "ఎలుకలన్ని జేరి సముద్రము వలె ఘోషించినప్పటికి ఏమి హాని జరుగుతుంది? శేషనాగు ఒక్క హుంకారం చేయగానే అవన్నీ నశిస్తాయి" అని పోస్ట్ చేశారు.

Tags:    

Similar News