కర్నూలు ఘటనపై పవన్ రియాక్షన్.. ఏమన్నారంటే!
కర్నూలులోని చిన్నటేకూరు శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు;
కర్నూలులోని చిన్నటేకూరు శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎం తో కలచి వేసిందని తెలిపారు. 19 మంది మృతి చెందిన ఘటన పట్ల మాట్లాడేందుకు కూడా మాటలు చా లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
గాఢ నిద్రలో ఉండగా..
కర్నూలు ప్రమాద ఘటనపై జిల్లా డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నా రని, వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉన్నారని, దీంతో వారు తేరుకునే సరికే.. బస్సు మొత్తం మంటలు వ్యాపించాయ ని చెప్పారు. ఈ ప్రమాదం నుంచి 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.
ఈ ప్రమాదానికి కారణంపై ఎస్పీ విక్రాంత్ మాట్లాడుతూ.. కేవలం బైకును ఢీకొట్టిన తర్వాత.. మంటలు వ్యాపించాయ ని తెలిపారు. బస్సు డీజిల్ ట్యాంక్‌కు ఎలాంటి లీకులు లేవన్నారు. ప్రమాదానికి డీజిల్ ట్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిందన్న ఎస్పీ.. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ను విచారిస్తున్నామన్నారు. అయితే.. ప్రధాన డ్రైవర్ పరారయ్యాడని.. ఆయనను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంపై వదంతులు వ్యాప్తి చేయొద్దని సోషల్ మీడియా, యూట్యూబర్లకు విజ్ఞప్తి చేశారు.