పవన్ పోరాటం ఫలించింది...ఏపీ గర్వం నిలిచింది !
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఎర్ర మన్ను దిబ్బల మీద కొందరి కన్ను పడిందని వార్తలు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు.;
ప్రకృతి రమణీయతను అలా కళ్ళరా చూడాలి కానీ దానిని చిదిమేయాలని అసలు ఆలోచించకూడదు. ఇక మన కల్చర్ కానీ సాంస్కృతిక సంపద కానీ ఎపుడూ గౌరవంగా గర్వంగా ఉండాలి. ఎందుకంటే అవి వందల వేల ఏళ్ళుగా ఉంటున్నాయి. అలాగే వాటి దీప్తిని స్పూర్తిని కాపాడుతూ భావి తరాలకు అందించాల్సి ఉంది. కానీ కొన్ని చోట్ల హెరిటేజ్ కి చిహ్నంగా ఉన్న కీలక ప్రాంతాలు అంతరించిపోతున్నాయి. కబ్జాలకు దందాలకు గురి అవుతున్నాయి. వాటి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం అయితే ఫలించింది అని చెప్పాలి. ఈ రోజున భీమిలీ నియోజకవర్గంలోని ఎర్ర మన్ను దిబ్బలకు యునెస్కో తాత్కాలిక సహజ వారసత్వ ప్రదేశాల జాబితాలో తిరుమల కొండలతో పాటుగా చోటు దక్కింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా మారింది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ఘనమైన కీర్తిని తెచ్చిపెట్టింది.
వెండి తెర మీద మెరిసి :
ఎనభై దశకంలో వెండి తెర మీద ఎవర్ గ్రీన్ క్వీన్ గా ఎర్ర మన్ను దిబ్బలు మెరిసి మురిసింది. ఎన్నో పాటలు మరెన్నో సన్నివేశాలు ఇంకెన్నో యాక్షన్ సీన్లు ఇక్కడ చిత్రీకరించారు. ఆ తరువాత వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడంతో వీటి మీద మరింత ఒత్తిడి పెరిగింది. ఇక కబ్జా కోరల్లో చిక్కుకుని మరీ నలిగిపోయింది. ఈ నేపధ్యంలో విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలోని ఎర్ర మన్ను దిబ్బలు అన్నవి కుంచించుకుని పోతీ అంతర్ధానం అయ్యే ప్రమాదానికి వచ్చేశాయి. దాంతో జనసేన వీటి పరిరక్షణకు పూనుకుంది.
పవన్ నేరుగా వచ్చి :
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఎర్ర మన్ను దిబ్బల మీద కొందరి కన్ను పడిందని వార్తలు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అలా 2023లో ఎర్ర మన్ను దిబ్బలను సందర్శించిన పవన్ వాటిని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బఫర్ జోన్ గా మార్చాలని వీటి చుట్టూ రక్షణ గోడ కట్టాలని కూడా సూచించారు. వీటిని ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేక సంపదగా ఆయన పేర్కొన్నారు. ఒకనాడు ఏకంగా 1200 ఎకరాల దాకా విస్తరించి ఉన్న ఎర్ర మన్ను దిబ్బలు దురాక్రమణలు వల్ల విధ్వంసం వల్ల కేవలం 292 ఎకరాలకు పరిమితం అయి కుంచించుకొని పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సంపదగా ఉన్న ఎర్ర మన్ను దిబ్బలను పరిరక్షించడం కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయిస్తామని చెప్పారు.
వేల చరిత్ర అలా :
ఎర్ర మన్ను దిబ్బల వయసు దాదాపుగా రెండు వేల ఏళ్ళుగా భౌగోళిక చరిత్రకారులు చెబుతారు. ఇవి అత్యంత సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలుగా పేర్కొంటారు. ఇవి చాలా అరుదుగా దేశంలో కొన్ని చోట్ల ఉన్నాయి. ఏపీలో చూస్తే ఉత్తరాంధ్రాలో ఇవి కనిపిస్తాయి అందుకే వీటిని కాపాడుకోవాలని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇక జనసేన అయితే ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
పార్టీ తరఫున పోరాటం :
అదే సమయంలో జనసేన పార్టీ ఈ విషయంలో చేయాల్సిన పోరాటం అంతా చేసింది. దీని మీద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఎర్ర మన్ను దిబ్బల పరిరక్షణ పోరాటానికి ఎంతో మద్దతు ఇచ్చారు అన్నారు. జాతీయ జల వనరుల పోరాట కర్త రాజేంద్ర సింగ్ తో కలసి తాను పనిచేశాను అని చెప్పారు. స్థానికంగా తమ పార్టీ కార్పొరేటర్ మూర్తితో పాటు ఇతర నాయకుల సహకారంతో జాతీయ స్థాయికి ఈ ఇష్యూని చేర్చగలిగామని అన్నారు. ఈ రోజున యునెస్కో గుర్తింపు లభించడంతో ఎర్ర మన్ను దిబ్బల వైభవం మరిన్ని వేల ఏళ్ళ పాటు వర్ధిల్లుతుందని అన్నారు. రానున్న రోజులలో మరింతగా పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.