పవన్ తో గంటా ఇంట్రెస్టింగ్ మీట్

అయితే అదంతా గతం. ఇపుడు చూస్తే ఇద్దరూ కూటమిలో ఉన్నారు. అయితే గంటా ఒక ఎమ్మెల్యేగా ఉంటే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నారు.;

Update: 2025-07-23 19:36 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖలో విడిది చేస్తే సాగర తీరాన సినీ రాజకీయ కోలాహలం ఒక్క లెక్కన సాగింది సినీ అభిమానులు కుర్రకారు పవర్ స్టార్ అని పూనకాలు పోయారు. అదే సమయంలో కూటమి ఎమ్మెల్యేలు కీలక నేతలు అంతా పవన్ చుట్టూ ర్యాలీ అయ్యారు.

విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు పవన్ ని మీట్ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. పవన్ కి బొకే ఇచ్చి మరీ గంటా నవ్వులు చిందించారు. పవన్ కూడా గంటాతో కలసి నవ్వుతూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు.

జనసేనాని కూటమిలో అతి ముఖ్యుడు అయిన పవన్ ని సీనియర్ నేత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా మర్యాదపూర్వకంగా కలిశారు అని అంటున్నారు. గంటా గతంలో ప్రజారాజ్యంలో ఉండేవారు. ఇక ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న వేళ పవన్ జనసేన అధినేతగా ఉంటూ 2017 నుంచి 2019 మధ్యలో హాట్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు.

అయితే అదంతా గతం. ఇపుడు చూస్తే ఇద్దరూ కూటమిలో ఉన్నారు. అయితే గంటా ఒక ఎమ్మెల్యేగా ఉంటే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో హరిహర వీర మల్లు సినిమా సూపర్ హిట్ కావాలని గంటా కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారని అయితే వీర మల్లుతో భారీ హిట్ కొడతారు అని గంటా జోస్యం చెప్పారు.

అంతే కాదు బ్లాక్ బస్టర్ హిట్ అని కచ్చితంగా చెప్పారు. కొత్త జానర్ లో పవన్ నటించిన ఈ సినిమా బంపర్ హిట్ అయి తీరుతుందని గంటా అన్నారు. మొత్తానికి చూస్తే గంటా పవన్ ల భేటీ మాత్రం అందరికీ ఆసక్తిని పెంచింది.

రాజకీయంగా ఈ రోజు పవన్ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన సినీ ఇమేజ్ కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు. వీరమల్లుతో ఆయన హిట్ కొడతారు అని అంటున్నారు. దీంతో పవన్ రాజకీయ రాజసం సినీ వైభవం కలసికట్టుగా ముందుకు సాగుతూ అద్భుత విజయాలు అందిస్తున్నాయని అంటున్నారు. విశాఖకు చాలా కాలానికి పవన్ రావడం అది కూడా పవర్ స్టార్ గా రావడంతో అభిమాన లోకం పులకరించింది. అదే విధంగా రాజకీయం అంతా ఆయన చుట్టూ తోరణం కట్టింది. మొత్తానికి పవన్ విశాఖ పర్యటన రాజకీయ సినీ సందడిని హోరెత్తించింది అని చెప్పాల్సిందే.

Tags:    

Similar News