• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  "ఆంధీ కళ్యాణ్"... మరాఠాలో...

"ఆంధీ కళ్యాణ్"... మరాఠాలో పవన్ స్పీచ్ వీడియో వైరల్!

| ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన అభిమానులకు, కార్యకర్తలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-11-16 11:42 GMT

గతంలో ఇంగ్లిష్, హిందీ తోపాటు కన్నడ, తమిళ భాషల్లో మాట్లాడిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా ఆయన అభిమానులకు, కార్యకర్తలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా... మహారాష్ట్ర వేదికగా మరాఠాలో తనదైన శైలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో ఎన్డీయే అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ శనివారం మహారాష్ట్ర చేరుకున్నారు.

ఈ సందర్భంగా డెగ్లూర్ లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. మరాఠీలో ప్రసగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇది కచ్చితంగా బిగ్ సర్ ప్రైజ్ అని అంటున్నారు నెటిజన్లు.

ఈ సందర్భంగా మైకందుకున్న పవన్ కళ్యాణ్... జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రారంభించారు. ఈ సందర్భంగా... ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల, ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర అంటూ కొనసాగించారు. మరాఠా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.

తాను.. మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి, ఆ యోధుల పోరాటాలు గుర్తు చేసుకోవడానికి.. శివాజీ మహరాజ్ పాలనను, స్వాతంత్ర సమరయోధుల స్పూర్తిని గుర్తు చేసుకోవడానికి వచ్చానని.. అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించడానికి వచ్చానే తప్ప.. ఓట్లు అడగడానికి రాలేదని అన్నారు.

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో డెగ్లూరులో ఎంతో అభివృద్ధి జరుగుతోందని.. ప్రతీ ఇంటికీ తాగునీటి సౌకర్యం, హేమద్వంతి ఆలయ అభివృద్ధి జరుగుతోందని.. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని.. డెగ్లూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీయే సభ్యుడి విజయం ఎంతో అవసరం అని అన్నారు.

అంతకముందు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ మాట్లాడుతూ... ఇవాళ డెగ్లూర్ కు వచ్చింది పవన్ కల్యాణ్ కాదని.. ‘ఆంధీ కళ్యాణ్’ (తుపాను

కళ్యాణ్) అని అభివర్ణించారు.

Deputy CM @PawanKalyan at Deglur, Maharashtra #PawanKalyanForMaharashtra pic.twitter.com/pFulj3RhKx

— Chanandler bOnG (@BongChh) November 16, 2024
Tags:    
  • Pawankalyan 
  • Andhrapradesh 
  • Maharashtraelections 
  • Electioncampaign 
  • Apdeputycm 
  • NDAAlliance 
  • Pawankalyanspeech 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS