ఇవేం విశ్ల‌ష‌ణ‌లండీ బాబూ.. : జ‌న‌సేన ఎమ్మెల్సీ అవాక్కు

ఆయ‌న గురువారం ఉద‌య‌మే .. విశాఖ‌ప‌ట్నానికి వెళ్లిపోయారు. అంతే.. ఇంకేముంది.. `కూట‌మిలో క‌ల్లోలం` అంటూ.. పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

Update: 2026-08-13 18:01 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన‌పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి.. గురువారం ఉద‌యం పెద్ద ఎత్తున సోష‌ల్ మీడి యాలోను ఓ వ‌ర్గం ప్ర‌ధాన మీడియాలోనూ విశ్లేష‌ణ‌ల పేరుతో పెద్ద ఎత్తున చ‌ర్చ చేప‌ట్టారు. అమ‌రావ‌తి రాజ‌ధా నిలో గురువారం కీల‌క ఘ‌ట్టం జ‌రిగింది. ముఖ్య‌మైన సీడ్ యాక్సెస్ రోడ్డు స‌హా.. ఎమ్మెల్సీ క్వార్ట‌ర్స్‌, అలానే కొండ‌వీటి వా గుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిల‌ను సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ పాల్గొన లేదు. ఆయ‌న గురువారం ఉద‌య‌మే .. విశాఖ‌ప‌ట్నానికి వెళ్లిపోయారు. అంతే.. ఇంకేముంది.. `కూట‌మిలో క‌ల్లోలం` అంటూ.. పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

వీటిపై జ‌న‌సేన ఎమ్మెల్సీ ఒక‌రు మీడియాతో ఆఫ్‌దిరికార్డుగా స్పందిస్తూ.. ``ఇవేం విశ్లేష‌ణ‌లండీబాబూ. నిజాలు తెలు సుకోరా?.. ఏది బ‌డితే అది చెప్పేస్తారా?`` అంటూ.. ప్ర‌శ్నించారు. అయితే.. ఆయ‌న విస్మ‌యం వ్య‌క్తం చేసినా.. వాస్త వాలు తెలుసుకోవాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అమ‌రావ‌తిలో జ‌రిగిన కార్య‌క్ర‌మం.. దీనికి ముందు జ‌రిగిన ప‌రిణామాల‌ను పేర్కొంటూ.. అనేక విశ్లేష‌ణ‌లు అయితే వ‌చ్చాయి. ఆ విశ్లేష‌ణ‌ల్లో కొన్నింటిని.. వాటి వెనుక ఉన్న వాస్త‌వాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

1) అమ‌రావ‌తి కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ డుమ్మా: అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు పాల్గొన్న కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ డుమ్మా కొట్టారని.. ఆయ‌న‌కు అమ‌రావ‌తిపై ఇంట్ర‌స్ట్ లేదని... విశ్లేష‌కులు చెప్పుకొచ్చారు. అందుకే ఆయ‌న విశాఖ ప‌ట్నం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి పోయార‌ని కూడా వ్యాఖ్యానించారు.

వాస్త‌వం: అమ‌రావ‌తి కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ రాలేక‌పోయిన మాట వాస్త‌వం. కానీ, ఇదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మంత్రులు ఇద్ద‌రు.. నాదెండ్ల మ‌నోహ‌ర్‌, దుర్గేష్‌, అలానే ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్‌ల‌ను పంపించారు. సో.. దీనిని బ‌ట్టి.. ఆయ‌న‌కు అమ‌రావ‌తి అంటే ఇంట్ర‌స్ట్ ఉన్న‌ట్టా లేన‌ట్టా అనేది అర్థ‌మ‌వుతుంది. ఇక‌, మ‌రో కామెంట్‌.. విశాఖ‌కు వెళ్లిపోయార‌ని. నిజ‌మే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌కు వెళ్లారు. దీనికి కార‌ణం.. గురువారం అంత‌ర్జాతీయ ఏనుగుల దినోత్స‌వం. దీనిని విశాఖ‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్రమానికి కేంద్ర మంత్రి కీర్తివర్థన్ సింగ్ వ‌చ్చారు. దీంతో ప్రొటోకాల్ ప్ర‌కారం.. అట‌వీ శాఖ మంత్రిగా ఉన్న ప‌వ‌న్ హాజ‌ర‌య్యారు. దీనిలో త‌ప్పేముంది? అనేది ప్ర‌శ్న‌.

2) మంత్రి నారాయ‌ణ రాయ‌బారం చేశారు: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. అందుకే బుధ‌వారం మంత్రి నారాయ‌ణ స్వ‌యంగా వెళ్లి ఆయ‌న‌తో రాయ‌బారం చేశార‌ని.. అమ‌రావ‌తి ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ఆహ్వానించార‌ని.. అయినా రాలేద‌ని విశ్లేషించారు.

వాస్త‌వం: నిజ‌మే.. మంత్రి నారాయ‌ణ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆఫీసుకు బుధ‌వారం వెళ్లారు. రాష్ట్రంలో సీఎం త‌ర్వాత‌.. డిప్యూటీసీఎం ప్రొటోకాల్ ప్ర‌కారం ప్రాధాన్యం సంత‌రించుకున్న నేప‌థ్యానికి తోడు. కూట‌మి భాగ‌స్వామ్య పక్షం కావ‌డంతో మంత్రి నారాయ‌ణ వెళ్లి.. ఆయ‌న‌కుఆ హ్వాన ప‌త్రిక అందించారు. అలానే.. బీజేపీ మంత్రి స‌త్య‌కుమార్‌యాద‌వ్‌కు కూడా ఇచ్చారు. ఇలా.. రెండూ జ‌రిగాయి. కానీ, ప‌వ‌న్ కోణంలోనే విశ్లేష‌కులు ఆలోచ‌న చేశారు.

3) మూడు మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌కు డుమ్మా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్ప‌టికి మూడు సార్లు జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌కు డుమ్మా కొట్టారంటూ.. కొంద‌రు విశ్లేషించారు. త‌ద్వారా.. ఆయ‌న కూట‌మి ప్ర‌భుత్వంపై అస‌హ‌నంతో ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఇది ముందు ముందు పెరుగుతుంద‌ని కూడా చెప్పేశారు.

వాస్త‌వం: నిజ‌మే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు మంత్రివ‌ర్గ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. కానీ, దీనివెనుక రాజ‌కీయం లేదు. ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లే ఉన్నాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. గ‌త రెండు మంత్రివ‌ర్గ స‌మావేశాల స‌మ‌యంలో ఆయ‌న ఒక‌సారి ముక్కు స‌మ‌స్య‌, రెండోసారి భుజం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డ్డారు. ఇక‌, తాజాగా నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశం రోజు ఆయ‌న చేతికి ఉన్న క‌ట్టు విప్పి.. వైద్యులు మ‌రోసారి ప‌రీక్ష‌లు చేశారు. ఇది 4 గంట‌ల పాటు జ‌రిగింది. ఈ విష‌యాలు.. వాస్త‌వాల‌ను విస్మ‌రిస్తున్న ఓ వ‌ర్గం మీడియా.. విశ్లేష‌ణ‌ల పేరుతో వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News