• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇక దేశమంతా జీరో...

ఇక దేశమంతా జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌... నేర శిక్షాస్మృతి బిల్లులకు ఆమోదం!

| భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్‌.ఎస్‌) లో... కొత్తగా 20 నేరాలను చేర్చడంతోపాటు ఐపీసీ సెక్షన్ 19 నిబంధనను తొలగించారు.

By - Tupaki Desk
Update: 2023-12-21 04:53 GMT

దాదాపు 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్ - ఐ.పీ.సీ), నేర శిక్షాస్మృతి (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ - సీ.ఆర్‌.పీ.సీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌ సభ ఆమోదం తెలిపింది. ఇక వాటిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే.. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకమే తరువాయి. ఆ సంతకం అవ్వగానే అవి చట్టాలుగా మారతాయి.

అవును... బ్రిటిష్‌ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐ.పీ.సీ), నేర శిక్షాస్మృతి (సీ.ఆర్‌.పీ.సీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో... భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్‌.ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీ.ఎన్‌.ఎస్‌.ఎస్‌.), భారతీయ సాక్ష్య అధినియం (బీ.ఎస్‌).. పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా భారతీయ చట్టాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఇందులో భాగంగా పాత చట్టంలో అత్యాచారానికి సెక్షన్ 375, 376 ఉండగా... కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 63 గా పేర్కొన్నారు. ఇదే సమయంలో... పాత చట్టంలో హత్యకు సెక్షన్‌ 302 ఉండగా.. కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 101 గా మార్చారు. ఇదే క్రమంలో... కిడ్నాప్‌ కు పాత చట్టంలో సెక్షన్‌ 359 ఉండేది. అయితే... కొత్త బిల్లులో దానిని సెక్షన్‌ 136 కింద చేర్చచడం జరిగింది.

భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్‌.ఎస్‌) లో... కొత్తగా 20 నేరాలను చేర్చడంతోపాటు ఐపీసీ సెక్షన్ 19 నిబంధనను తొలగించారు. ఇదే సమయంలో 33 నేరాల్లో జైలు శిక్ష పెంచడంతోపాటు 83 నేరాల్లో జరిమానా పెంచారు. ఇక 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించేలా మార్పులుచేయడంతోపాటు కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్షను చేర్చారు. ఉదాహరణకు... రూ.5వేల లోపు దొంగతనాలకు చేసిన వారికి ఈ సమాజ సేవ శిక్ష విధిస్తారు.

భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీ.ఎన్‌.ఎస్‌.ఎస్‌) విషయానికొస్తే... నేరాంగీకార పరిధిని విస్తరించారు. దీనిలో గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో... మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో నిందితులను అరెస్టు చేయడానికి సీనియర్‌ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు.

ఇదే సమయంలో ఒక దేశమంతా జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. విధానాన్ని తీసుకొచ్చారు. ఇకపై ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయబడుతుంది. ఇక ఇందులో 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేర్పుకు అవకాశం ఇవ్వడంతోపాటు 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయాన్ని నిర్ధేశించారు. అదేవిధంగా... క్షమాభిక్ష పిటిషన్‌ కు సరికొత్త విధివిధానాలు తెచ్చారు.

భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) విషయానికొస్తే... ఈ కొత్త బిల్లులో రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్‌ సెక్షన్ల జోడించడంతోపాటు మరో 6 సెక్షన్లను తొలగించారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. ఇక భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్‌ సాక్ష్యం సేకరణను చేర్చారు!

Tags:    
  • Parliment 
  • Penalcodes 
  • Loksabha 
  • Bharatiyaneyasamhita 
  • Crpc 
  • Rajyasabha 
  • Ipc 
  • President 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS