బీజేపీ తగ్గింది...కాంగ్రెస్ గర్జించింది !

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగుస్తున్నాయి. మొత్తం 19 రోజుల పాటు పని దినాలుగా ఈసారి సెషన్ మొదలైంది.

Update: 2026-08-13 03:52 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగుస్తున్నాయి. మొత్తం 19 రోజుల పాటు పని దినాలుగా ఈసారి సెషన్ మొదలైంది. కానీ ప్రతీ రోజూ దాదాపుగా గందరగోళం మధ్యనే సభ వాయిదా పడుతూ వచ్చింది. ఏ ఒక్క రోజూ సాఫీగా సభ సాగిన దాఖలాలు అయితే లేవు. అంతే కాదు బీజేపీ సభలో తాను అనుకున్న విధంగా కీలక బిల్లులను ఆమోదించుకోలేకపోయింది. అంతే కాదు బిల్లులను సభ దాకా తీసుకుని రాలేకపోయింది అని అంటున్నారు. ఆఖరుకు విదేశీ నిధులని నియంత్రించే బిల్లు కూడా జేఏసీకి పంపించడానికి బీజేపీ సిద్ధపడింది.

ఎన్నో ఆశలతో బీజేపీ :

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మీద బీజేపీ ఎన్నో ఆశలను పెట్టుకుంది. ఈసారి సమావేశాలలో డీ లిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు ఆమోదం పొందుతాయని అనుకుంది. అలాగే విదేశీ నిధులని నియంత్రించే బిల్లు, జమిలి ఎన్నికల బిల్లు ఇంకా అనేక కీలక బిల్లులు కూడా సభ ముద్నుకు వస్తాయని ఆశించింది. దానికి తగిన ప్రాతిపదికను పూర్వ రంగానీ కూడా బీజేపీ సిద్ధం చేసుకుంది. తన బలాన్ని లోక్ సభలో అమాంతం పెంచుకుంది. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. వర్షాకాల సమావేశాలు ఏప్రిల్ 20న మొదలవుతూనే విద్యార్ధి ఉద్యమాలతో పాటు ఢిల్లీలో విద్యార్ధుల మీద పోలీసుల దాడులు వాటి మీద కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం ఇలా ప్రతీ రోజూ సభా వ్యవహారాలే సాగకుండా వాయిదాలు పడిపోయాయి.

రాహుల్ గర్జన :

ఈసారి అయితే రాహుల్ గాంధీ గట్టిగానే గర్జించారు అని అంటున్నారు. సభ లోపలా బయటా కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టారు. ఆఖరికి అమిత్ షా ప్రసంగం చేస్తాను అన్నా కూడా మేము కోరుకున్న దాని మీదనే మాట్లాడాలి అంటూ రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడం కూడా కాంగ్రెస్ గట్టిగా ఎంతలా నిలబడింది అన్నది తెలియచేసింది. ప్రతీ సారీ సభలో బీజేపీది పైచేయిగా ఉండేది. ఆ పార్టీ ఎలా అనుకుంటే అలాగే జరిగేది. కానీ ఈసారి మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కాంగ్రెస్ అండ్ మిత్ర పక్షాలు అయితే ఎన్ డీయే ప్రభుత్వాన్ని కట్టడి చేశాయని అంటున్నారు.

తగ్గాల్సిందేనా :

బీజేపీ అయితే ఈ సమావేశాలలోనే బాగా తగ్గింది అని అంటున్నారు. విపక్షాలు కోరినట్లుగా సభలో వివిధ అంశాల మీద చర్చిద్దామని కూడా ఎన్డీయే పేర్కొంది. అయితే ప్రకటనలతో కాదు, తాము డిమాండ్లు పెట్టిన అంశాల మీదనే మాట్లాడాలి అని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ కి ఏమి చేయాలో పాలు పోలేదనే చెప్పాలి. కీలక బిల్లుల సంగతి పక్కన పెట్టి విదేశీ నిధులని నియంత్రించే బిల్లుని అయినా ఆమోదించుకుంటే వర్షాకాల సమావేశాలకు ఒక సార్ధకత అని బీజేపీ పెద్దలు భావించినా విపక్షాలు ఆ బిల్లు ప్రవేశాన్నే గట్టిగా అడ్డుకుని ఎట్టకేలకు నిలువరించారు. బిల్లుని రద్దు చేసుకోవాలని కోరారు. అయితే బీజేపీ మాత్రం జాయింట్ పార్లమెంట్ కమిటీ ముందు అధ్యయనానికి ఈ బిల్లుని పంపడానికి సిద్ధపడింది. మరి ఈ బిల్లు వచ్చే సెషన్ లో అయినా సభ ముందుకు వస్తుందా అంటే చూడాల్సిందే మరి.

Tags:    

Similar News