• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కెరీర్ పిచ్చలో మెషిన్లుగా...

కెరీర్ పిచ్చలో మెషిన్లుగా మారిన ఈ పేరెంట్స్.. పాపను దత్తత ఇచ్చుడా?

| దీనికి నిలువెత్తు రూపంగా మారిన ఒక దంపతుల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-04-03 07:30 GMT

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఉరుకుల పరుగులే. కెరీర్ లో అంతకంతకూ దూసుకెళ్లాలన్న తపన తప్పించి.. మరింకేదీ ముఖ్యం కాదన్నట్లుగా తయారయ్యారు. దీనికి నిలువెత్తు రూపంగా మారిన ఒక దంపతుల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. జాబ్ హడావుడిలో పడి తన చిన్నారిని సరిగా చూసుకోలేకపోతున్నట్లుగా పేర్కొన్న ఈ జంట.. తమ పాపను దత్తత ఇచ్చేందుకు సిద్ధం కావటం.. అందుకు తగ్గట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

రెడిట్ వేదికగా తమ మూడు నెలల పాప (ఎలిజబెత్)ను దత్తత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చిన్నారి తండ్రి ఒక పోస్టు చేశారు. దీని సారాంశం ఏమంటే.. ‘‘మా ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నాం. పాపను చూసుకోవటానికి సమయం ఉండట్లేదు. వర్కు హాలిక్ అయిన తాము ఉద్యోగాన్ని చేస్తున్నామే తప్పించి చిన్నారిని పెంచే విషయంలో ఏ పని చేయలేకపోతున్నాం. నా భార్య ఎలిజిబెత్ కు పాలు పట్టటం.. దుస్తులు మార్చటం.. స్నానం చేయటం తప్పించి ఇంకేమీ చేయట్లేదు. మేం ఎప్పుడు ఎలిజిబెత్ తో టైం గడపలేదు. మా చిన్నారిని వాల్ల అమ్మమ్మే చూసుకుంటోంది. బిడ్డను కన్న రెండు వారాలకే ఆఫీసులో చేరింది. వర్కు మీద ఆమెకున్న కమిట్ మెంట్ అలాంటిది. తమ పాపను అమ్మమ్మ కానీ.. బంధువులు కానీ.. స్నేహితులు కానీ చేసుకోవాలి. లేదంటే.. ఎవరైనా బయట వారికి దత్తత ఇచ్చేందుకు సద్ధంగా ఉన్నాం’’ అంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఎలిజిబెత్ తండ్రి పెట్టిన ప్రపోజల్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. ‘మీరు ప్రేమాభిమానాలు లేని రోబోలా.. లేదంటే మానవ జీవితాలతో ప్రయోగాలు చేస్తున్న గ్రహాంతర వాసులా?’’ అంటూ విరుచుకుడ్డారు. ఎంత కెరీర్ అయితే మాత్రం మూడు నెలల కన్న కుమార్తెను ఎవరికో అప్పగించేస్తున్న ఈ వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ.. పిల్లలకు టైం కేటాయించలేమన్నదే భావన అయితే పిల్లల్ని ఎందుకు కన్నట్లు? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఏమైనా.. కెరీర్ పరుగులో ఈ తరహా పేరెంట్స్ ను ఇప్పటివరకు చూడలేదన్న మాట పలువురి నోట వినిపిస్తుందని చెప్పాలి.

Tags:    
  • SocialMedia 
  • 3monthsBaby 
  • AdoptingPost 
  • Elizabeth 
  • SocialMediaPost 
  • Adopting 
  • Joblife 

Similar News

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS